Barbiecore | చాట్‌జీపీటీ నుంచి కొత్త ట్రెండ్.. ఘిబ్లిఫైను మించి.. బార్బికోర్.. చేయడం చాలా సింపుల్
చాట్ జీపీటీ ఇటీవల తీసుకొచ్చిన ఘిబ్లి ట్రెండ్ ప్రపంచాన్ని ఊపేస్తుంటే.. అంతకు మించిన ట్రెండ్‌ను ఇప్పుడు అదే చాట్ జీపీటీ తీసుకొచ్చింది. స్టూడియో ఘిబ్లి తరహాలో ఆ చిత్రాలు త్రీ డీ కార్టూన్ బొమ్మల్లా ఉన్నాయి

Barbiecore | చాట్ జీపీటీ ఇటీవల తీసుకొచ్చిన ఘిబ్లి ట్రెండ్ ప్రపంచాన్ని ఊపేస్తుంటే.. అంతకు మించిన ట్రెండ్‌ను ఇప్పుడు అదే చాట్ జీపీటీ తీసుకొచ్చింది. స్టూడియో ఘిబ్లి తరహాలో ఆ చిత్రాలు త్రీ డీ కార్టూన్ బొమ్మల్లా ఉన్నాయి. దీంతో అందరూ తమ ఫొటోలను ఘిబ్లిఫై చేసుకున్నారు. దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. స్టూడియో ఘిబ్లిని కాపీ కొట్టారని కొందరు దుమ్మెత్తారు కూడా. ఇప్పుడు కొత్త ట్రెండ్‌ను చాట్ జీపీటీ తీసుకొచ్చింది. మనం అప్‌లోడ్ చేసిన చిత్రాలను బార్బీ బొమ్మల్లా మార్చేసి ఇస్తున్నది. బార్బీకోర్‌గా పిలుస్తున్న ఈ కృత్రిమ మేథ పనితనం చూసి.. యూజర్లు తమ బొమ్మలను కూడా అలా ముద్దుముద్దుగా కనిపించేలా మార్చేందుకు పోటెత్తుతున్నారు.
బార్బీకోర్ అంటే ఏమిటి?
బార్బీకోర్ అనేది ఒక ఏఐ చర్య. యూజర్లు ఇచ్చిన చిత్రాలను బార్బీ బొమ్మల తరహాలో రీక్రియేట్ చేసి.. మనం కోరుకున్న విధంగా అందిస్తున్నది. ఇది కూడా చాలా సింపుల్‌గానే అయిపోతుంది. చిన్నపిల్లల ఆటబొమ్మలు అమ్మే ప్యాకెట్లపై ఉండే బొమ్మల్లా ఇవి ఉంటున్నాయి. 80వ దశకం నాటి లుక్‌తో చిత్రం విచిత్రంగా కనిపిస్తున్నది. దీంతో యూజర్లు పోటీపడుతున్నారు. దీనిలో మీరు కూడా మీ చిత్రాలను మార్చుకోవచ్చు.
1. చాట్‌జీపీటీని ఓపెన్ చేయండి. అది డెస్క్‌టాప్ వెర్షన్ అయినా, మొబైల్ వెర్షన్ అయినా పనిచేస్తుంది.
2. మీ హై రిజొల్యూషన్ ఇమేజ్‌ను అప్‌లోడ్ చేయండి. మంచి క్వాలిటీ చిత్రమైతే బాగుంటుంది. ఫుల్ సైజ్ ఫొటోలైతే రిజల్ట్ చాలా బాగుంటుంది.
3. బార్బికోర్ తరహాలో కావాలంటూ.. మీ బొమ్మను తయారు చేయడానికి ప్రాంప్ట్ ఇవ్వండి. అంటే.. ఆ చిత్రం ఎలా ఉండాలి? దేనిపై రావాలి? ఏం పేరుతో ఉండాలి? ఏ రంగుల్లో ఉండాలి.. ఇలా వివరాలు ప్రాంప్ట్ చేయాలి.
4. ఇంకేముంది కొద్ది క్షణాల్లోనే చాట్‌జీపీటీ.. మీరిచ్చిన ఇమేజ్‌ను బార్బికోర్ చేసి ఇస్తుంది. డౌన్‌లోడ్ చేసుకుని.. ప్రింట్ తీసుకుంటారో, మీ స్టేటస్ పెట్టుకుంటారో.. డీపీగా ఉంచుతారో మీ ఇష్టం.
5. కావాలంటే ఆ ఇమేజ్‌ను రివ్యూ చేయొచ్చు.. చేసి.. మీకు కావాల్సిన అదనపు వివరాలు ఆ బొమ్మలో వచ్చేలా చేసుకోవచ్చు కూడా. మరింకేంటి ఆలస్యం.. ఛలో బాస్!!