Elon Musk | ఏఐ రంగంలోకి ఎలాన్ మస్క్
Elon Musk ఓపెన్ ఏఐకి పోటీగా కొత్త ప్లాట్‌ఫాం ఎక్స్‌ఏఐ కంపెనీని ప్రకటించిన మస్క్ నెవెడా: ప్రతి రంగంలో కాలు పెడుతున్న శతకోటీశ్వరుడైన పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ తాజాగా కృత్రిమ మేధ రంగంలో కాలుమోపారు. దీర్ఘకాలంగా పరీక్షల్లో ఉన్న తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ‘ఎక్స్‌ఏఐ’ని ప్రకటించారు. ప్రస్తుతం ఏఐ రంగంలో దూసుకుపోతున్న ఓపెన్ఏఐ కంపెనీ పోటీగా తన ఎక్స్‌ఏఐని తీర్చిదిద్దేందుకు అమెరికాలోని పలు దిగ్గజ టెక్నాలజీ కంపెనీల నుంచి సీనియర్ ఇంజినీర్లను నియమిస్తున్నారు. ఎలక్టిక్ కార్ల […]

Elon Musk
- ఓపెన్ ఏఐకి పోటీగా కొత్త ప్లాట్‌ఫాం
- ఎక్స్‌ఏఐ కంపెనీని ప్రకటించిన మస్క్
నెవెడా: ప్రతి రంగంలో కాలు పెడుతున్న శతకోటీశ్వరుడైన పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ తాజాగా కృత్రిమ మేధ రంగంలో కాలుమోపారు. దీర్ఘకాలంగా పరీక్షల్లో ఉన్న తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ‘ఎక్స్‌ఏఐ’ని ప్రకటించారు. ప్రస్తుతం ఏఐ రంగంలో దూసుకుపోతున్న ఓపెన్ఏఐ కంపెనీ పోటీగా తన ఎక్స్‌ఏఐని తీర్చిదిద్దేందుకు అమెరికాలోని పలు దిగ్గజ టెక్నాలజీ కంపెనీల నుంచి సీనియర్ ఇంజినీర్లను నియమిస్తున్నారు.
ఎలక్టిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా సీఈవోగా ఉన్న ఎలాన్ మస్క్ ఇప్పటికే రాకెట్ లాంచ్ కంపెనీ స్పేస్ ఎక్స్‌కు సీఈవోగా ఉన్నారు. ట్విట్టర్‌ను కూడా కొనుగోలు చేశారు. కొంతకాలంగా ఏఐ రంగాన్ని నియంత్రించాల్సి ఉన్నదని, అప్పటి వరకూ ఏఐ అభివృద్ధిని నిలిపివేయాలని చెబుతూ వస్తున్న మస్క్.. కృత్రిమ మేధ నాగరికత విధ్వంసానికి దారితీస్తుందని ఆందోళన కూడా వ్యక్తం చేశారు.
అయితే.. బుధవారం సాయంత్రం జరిగిన ట్విట్టర్ స్పేసెస్ ఈవెంట్‌లో మాట్లాడిన మస్క్.. సురక్షితమైన ఏఐని అభివృద్ధి చేయడంలో తన ప్రణాళికలను పంచుకున్నారు. తమ స్టార్టప్ విశ్వం యొక్క నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకుంటుందని చెప్పారు. ఇది మానవత్వానికి అనుకూలంగా ఉంటుందన్నారు.
మనుషుల కన్నా స్మార్ట్‌గా ఆలోచించే సూపరింటెలిజెన్స్ లేదా ఏఐ ఐదారు సంవత్సరాల్లో ఆవిర్భవిస్తుందని ఆయన తెలిపారు. వాస్తవానికి 2015లో చాట్‌జీపీటీని తీసుకొచ్చిన ఓపెన్‌ఏఐ కో ఫౌండర్‌గా మస్క్ ఉన్నారు. కానీ.. కంపెనీ బోర్డు నుంచి 2018లో తప్పుకొన్నారు. ఓపెన్‌ఏఐలో మైక్రోసాఫ్ట్ కూడా పెట్టుబడులు పెట్టింది. తాజాగా ప్రకటించిన ఎక్స్‌ఏఐలో గూగుల్ కంపెనీకి చెందిన పలువురు ప్రముఖ సాఫ్ట్‌వేర్ డెవలపర్లు ఉన్నారు.