అమెరికాలో విద్వేష దాడి… ఆరేళ్ల ముస్లిం బాలుడిపై కత్తిదాడి

- గాజాలో నిండుకుంటున్న చమురు నిల్వలు.. అంధకారంలోకి వెళ్లనున్న ఆసుపత్రులు
ఇజ్రాయెల్ – హమాస్ ఘర్షణ ప్రకంపనలు ప్రపంచమంతా కనిపిస్తున్నాయి. కొన్ని దేశాల్లో పాలస్తీనా వాసులు ఇజ్రాయెల్ దేశీయులపై దాడి చేస్తున్న ఘటనలు వెలుగుచూశాయి. తాజాగా ముస్లిం (Hate Crime) లు అనే కారణంతో అమెరికా (America) లో ఆరేళ్ల బాలుడు, అతడి తల్లిపై 71 ఏళ్ల వ్యక్తి కత్తితో దాడి చేశాయి. ఇలినాయిస్‌లో జరిగిన ఈ ఘటనలో బాలుడు ప్రాణాలు కోల్పోగా.. తల్లి తీవ్రగాయాలపాలయ్యారు. తమ ఇంటి యజమాని కత్తితో తమపై దాడి చేస్తున్నాడని 32 ఏళ్ల యువతి ఫోన్ చేయడంతో.. తాము వెళ్లామని పోలీసులు పేర్కొన్నారు. వారు తెలిపిన ప్రకారం.. పోలీసులు చేరుకునేటప్పటికే తల్లీ కుమారుడు తీవ్ర గాయాల పాలైన స్థితిలో కనిపించారు.
బాధితుల ఇంట్లోకి హఠాత్తుగా ప్రవేశించిన నిందితుడు.. మీ ముస్లింలు చావాల్సిందే అని గట్టిగా అరుస్తూ దాడి చేశాడు. దీనికి సంబంధించి ఆ యువతి, ఆమె భర్త మధ్య జరిగిన ఎస్ఎంఎస్‌లను అమెరికాలోని ముస్లిం హక్కుల సంస్థ సీఏఐఆర్ ఇంటర్నేషనల్ విడుదల చేసింది. ఆర్మీ అధికారుల దగ్గర ఉండే ఆయుధంతో ఈ దాడి జరిగిందని.. బాలుడి శరీరంపై 26 కత్తిపోట్లు ఉన్నాయని వైద్యులు పేర్కొన్నారు. తల్లికి 12 పోట్లు పడగా.. ప్రస్తుతం ప్రాణాపాయం నుంచి బయటపడినట్లేనని తెలిపారు. నిందితుణ్ని జోసెఫ్ ఎం జుబాగా గుర్తించిన పోలీసులు.. అతడు తన చర్య గురించి ఏమీ సందేశం ఇవ్వలేదని పేర్కొన్నారు.
మరోవైపు ఇజ్రాయెల్ దాడిలో గాజా (Gaza) మరుభూమిగా మారుతోంది. కొన్ని రోజుల క్రితమే విద్యుత్ సరఫరా నిలిచిపోగా.. ఇప్పటి వరకు డీజిల్ జనరేటర్లతో ఆసుపత్రులు నెట్టుకొస్తున్నాయి. ఈ రోజుతో అవి కూడా నిలిచిపోతాయని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. అక్కడకి ఇంధనాన్ని తరలించడం ఆత్మహత్యా సదృశమేనని అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు పేర్కొన్నాయి. తీవ్రగాయాలపాలైన చిన్నారులు, ఇతర బాధితులకు నిరంతర విద్యుత్ సరఫరా అవసరం కావడంతో వారి భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశముంది. ఇప్పటి వరకు గాజాలో 2,670 మంది చనిపోగా.. 9,600 మంది గాయాలపాలయ్యారు.