Tirumala parakamani theft case| తిరుమల పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

తిరుమల పరకామణి చోరీ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఐడీ, ఏసీబీ డీజీలను ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. కేసు దర్యాప్తులో భాగంగా ఐటీ, ఈడీతో సమాచారం పంచుకోవాలని స్పష్టం చేసింది.

Tirumala parakamani theft case| తిరుమల పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

అమరావతి : తిరుమల పరకామణి చోరీ కేసు( Tirumala parakamani theft case)లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఐడీ, ఏసీబీ డీజీలను ఏపీ హైకోర్టు( AP High Court) కీలక ఆదేశాలిచ్చింది. కేసు దర్యాప్తులో భాగంగా ఐటీ, ఈడీతో సమాచారం పంచుకోవాలని స్పష్టం చేసింది. సీఐడీ, ఏసీబీ డీజీలు ఇచ్చిన నివేదికలు పరిశీలించిన తర్వాత హైకోర్టు ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. పరకామణి కేసు లోక్‌ అదాలత్‌ వద్ద రాజీ వ్యవహారం, నిందితుడు రవికుమార్‌ ఆస్తులపై దర్యాప్తును కొనసాగించాలని ఆదేశించింది.

ఈ కేసులో సమాచారాన్ని పరస్పరం పంచుకోవాలని సీఐడీ, ఏసీబీ డీజీలకు సూచించింది. టీటీడీ మాజీ ఏవీఎస్‌వో సతీష్‌ శవపరీక్ష నివేదికను సీల్డు కవర్‌లో రిజిస్ట్రార్‌ జ్యుడీషియల్‌కు అందించాలని సీఐడీని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం ఈనెల 16కు వాయిదా వేసింది.