ప్రపంచ క్రికెట్‌ మొత్తం భారత్‌ గుప్పెట్లో ఉంది : పీసీబీ ఛైర్మన్‌ రమీజ్‌ రజా

విధాత‌: పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు కొత్త ఛైర్మన్‌ రమీజ్‌ రజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ప్రపంచ క్రికెట్‌ మొత్తం భారత్‌ గుప్పెట్లో ఉందని, ఆ దేశం తలుచుకుంటే పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) కుప్పకూలిపోతుందని దాని కొత్త ఛైర్మన్‌ రమీజ్‌ రజా అన్నాడు. ఆదాయ పరంగా భారత్‌ మీదే ఎక్కువ ఆధారపడి ఉండటం వల్ల ఐసీసీ కూడా ఆ దేశాన్ని ఏమీ చేయలేదని అతనన్నాడు. ‘‘ఐసీసీలో రాజకీయ పరంగా ఆసియా, పాశ్చాత్య దేశాల వర్గాలు విడిపోయాయి. […]

ప్రపంచ క్రికెట్‌ మొత్తం భారత్‌ గుప్పెట్లో ఉంది : పీసీబీ ఛైర్మన్‌ రమీజ్‌ రజా

విధాత‌: పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు కొత్త ఛైర్మన్‌ రమీజ్‌ రజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ప్రపంచ క్రికెట్‌ మొత్తం భారత్‌ గుప్పెట్లో ఉందని, ఆ దేశం తలుచుకుంటే పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) కుప్పకూలిపోతుందని దాని కొత్త ఛైర్మన్‌ రమీజ్‌ రజా అన్నాడు. ఆదాయ పరంగా భారత్‌ మీదే ఎక్కువ ఆధారపడి ఉండటం వల్ల ఐసీసీ కూడా ఆ దేశాన్ని ఏమీ చేయలేదని అతనన్నాడు. ‘‘ఐసీసీలో రాజకీయ పరంగా ఆసియా, పాశ్చాత్య దేశాల వర్గాలు విడిపోయాయి. దాని ఆదాయంలో 90 శాతం భారత్‌ నుంచే వస్తుంది. పీసీబీ ఆదాయంలో 50 శాతం ఐసీసీ ఇస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్థాన్‌ క్రికెట్‌ను నడిపిస్తోంది భారత సంస్థలే. రేప్పొద్దున భారత ప్రధాని పాక్‌కు నిధులు ఆపేయమంటే పీసీబీ కుప్పకూలిపోతుంది’’ అని రమీజ్‌ అన్నాడు.