ఫిలిప్పీన్స్‌లో విరుచుక పడిన రాకాసి అలలు

ఫిలిప్పీన్స్‌లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా 32 మంది మృతి చెందారు. సునామీ హెచ్చరికలతో రాకాసి అలలు తీరప్రాంతాలను ముంచెత్తుతున్నాయి.

ఫిలిప్పీన్స్‌లో సంభంచిన భారీ భూకంపం ఘటనలో దేశ వ్యాప్తంగా 32మంది మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు. పలువురు శిథిలాల కింది చిక్కుకున్నారు. అనేక నగరాల్లో పెద్ద సంఖ్యలో భవనాలు నేలకూలాయి. ఆ దేశ యంత్రాంగం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. భూ కంప తీవ్ర రిక్టర్ స్కేలుపై 7.8 గా నమోదైంది. దీంతో ప్రకంపనల ధాటికి పెద్ద ఎత్తున భవనాలు, ఎయిర్ పోర్టు నిర్మాణాలు దెబ్బతిన్నాయి. సరంగాని ప్రావిన్సులోని గ్లాన్‌ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి 13 మంది గ్రామస్థులు ప్రాణాలు కోల్పోయారు.

భూకంప తీవ్రత ధాటికి సముద్రం అల్లకల్లలోంగా మారిపోయింది. ఫిలిప్పీన్స్‌తోపాటు ఇండోనేషియా, పలావు, తైవాన్, పపువా న్యూ గినియాకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. తీర ప్రాంతాల్లోకి చొచ్చుకుని వస్తున్న సముద్రపు రాకాసి అలల ధాటికి జనావాసాలు ధ్వంసమైపోతున్నాయి. పలవాన్ తీరం సహా పలు చోట్ల 1-3 మీటర్ల మేర సముద్రం ముందుకు దూసుకురావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సునామీ హెచ్చరికల నేపథ్యంలో తీరప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.

దేశంలో సంభవించిన భూకంపాన్ని భారీ భూకంపంగా ఫిలిప్పీన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వోల్కనాలజీ డైరెక్టర్‌ టెరిసిటో బకోల్కోల్‌ పేర్కొన్నారు. అమెరికా జియోలాజికల్‌ సర్వే భూకంప లోతును 55 కిలోమీటర్లు(34 మైళ్లు)గా పేర్కోనడం గమనార్హం.

Latest News