సింగపూర్ బోనాలు జూలై 21న.. రిజిస్ట్రేషన్లు ఇలా చేసుకోండి
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) బోనాల జాతరకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది. ఈ వేడుకలు సికింద్రాబాద్‌లోని ప్రసిద్ధ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలకు అనుగుణంగా జులై 21న ఆదివారం జరగనున్నాయని నిర్వాహకులు తెలిపారు.

సింగపూర్: తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) బోనాల జాతరకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది. ఈ వేడుకలు సికింద్రాబాద్‌లోని ప్రసిద్ధ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలకు అనుగుణంగా జులై 21న ఆదివారం జరగనున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకూ వేడుకలు నిర్వహించనున్నారు.
సింగపూర్‌లోని 25 సుంగాయి కడుట్ అవెన్యూ శ్రీ అరసకేసరి శివాలయంలో ఈ వేడుకలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. బోనాల పండుగలో అందరూ పాల్గొనవచ్చని, దీనికి ఎలాంటి ప్రవేశ రుసుము లేదని వెల్లడించారు. పూజల అనంతరం ప్రసాదాలు పంపిణీ చేస్తారు. ఈ వేడుకల్లో పాల్గొన దల్చినవారు వెంటనే లింకును @https://bit.ly/TCSSBONALU2024 క్లిక్ చేసి పేర్లు రిజిస్టర్ చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. ఆలయం వరకూ బస్సు సదుపాయం, ఇతర వివరాలకోసం తమను సంప్రదించాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమానికి భక్తులు విరాళాలు, స్పాన్సర్‌షిప్‌ల కోసం సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. వివరాలు రిజిస్ట్రేషన్ ఫాంలో పొందుపర్చి ఉన్నాయి.