BRS Rally : సికింద్రాబాద్ బచావో బీఆర్ఎస్ ర్యాలీ ఉద్రిక్తత !

సికింద్రాబాద్ బచావో ర్యాలీలో ఉద్రిక్తత! కార్పొరేషన్ డిమాండ్‌తో బీఆర్ఎస్ ఆందోళన.. తలసాని సహా పలువురు నేతల అరెస్ట్. అస్తిత్వం కోసం పోరాడుతామన్న కేటీఆర్.

BRS Rally : సికింద్రాబాద్ బచావో బీఆర్ఎస్ ర్యాలీ ఉద్రిక్తత !

విధాత, హైదరాబాద్ : సికింద్రాబాద్ కార్పోరేషన్ కోసం బీఆర్ఎస్ శనివారం నిర్వహించిన సికింద్రాబాద్ బచావో ర్యాలీ ఉద్రిక్తతలు, అరెస్టులకు దారితీసింది. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు శాంతి ర్యాలీకి పిలుపునిచ్చారు.నల్ల జెండాలు, కండువాలు ధరించి సికింద్రాబాద్ బచావో అంటూ నినాదాలు ఇస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ బచావో ర్యాలీ సాగింది. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు.

సికింద్రాబాద్‌ జిల్లా సాధన సమితి పేరుతో ర్యాలీకి అనుమతి అడిగారని.. అయితే నగరంలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్న కారణంతో ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. తెలంగాణ భవన్ నుంచి ర్యాలీలో పాల్గొనేందుకు వస్తున్న బీఆర్ఎస్ మాజీ మంత్రులను, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, నాయకులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భారీ సంఖ్యలో పోలీసులు, ప్రత్యేక బృందాలను మోహరించారు.

అరెస్టులపై మాజీ మంత్రి కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు మండిపడ్డారు. నిరసన తెలిపే హక్కు మాకు లేదా అని ప్రశ్నించారు. శాంతియుత ర్యాలీలో పాల్గొంటామని అనుమతి అడిగితే ఇవ్వకుండా ఎక్కడికక్కడ నిర్బంధాలు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకుంటామని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి :

Music Directors | హీరోలుగా మారుతున్న సంగీత ద‌ర్శ‌కులు… కోలీవుడ్ నుండి టాలీవుడ్‌కి వ‌చ్చిన కొత్త ట్రెండ్
Kawah Ijen | అత్యంత ప్రమాదకర ‘ఆమ్ల సరస్సు’ – తాకితే బూడిదే : ఎక్కడో తెలుసా?