విధాత : రోబోల వినియోగం విరివిగా పెరిగిపోయిన చైనాలో వాటితో ప్రజలు, ఉద్యోగులు దుష్ఫలితాలను కూడా చవి చూస్తున్నారు. రోబోట్లు మనుషుల ఉద్యోగాలకు ఎసరు పెట్టడమే కాదు..విధి నిర్వహణలో తిక్క రేగిందంటే చాలు…సహచర మానవ ఉద్యోగులపై దాడులు కూడా చేస్తూ పరుగులు పెట్టిస్తున్నాయి. తాజాగా చైనాలో ఓ రోబోట్ ఉద్యోగులపై దాడి చేసి వారిని ఆఫీసు నుంచి పరుగులు పెట్టించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చైనాలోని ఓ ఆఫీసులో పనిచేస్తున్న హ్యూమనాయిడ్ రోబోట్ ఒక్కసారిగా మాల్‌ఫంక్షన్‌కు గురై చేతులు, కాళ్లు అదుపు లేకుండా వాడేస్తూ ఉద్యోగులపై దాడికి దిగి భయభ్రాంతులకు గురి చేసింది.అచ్చం బ్రూస్ లీ ని తలపించేలా ఫైటింగ్ ఫోజులతో ఉద్యోగులపై ముష్టిఘాతాలు, కాలితో తన్నడాలు చేసేసింది. రోబోట్ ఫైట్ పవర్ చూసి ఉద్యోగులు పరుగులు తీయగా, కొందరు తమ క్యాబిన్ లలో దాక్కున్నారు. ఓ ఉద్యోగి ధైర్యంగా దానిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించి తను కూడా దాని దెబ్బను చవిచూసింది.
ఉద్యోగులపై రోబోట్ వీరంగం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్లు..రోబోట్ లు ఉద్యోగాలు చేస్తాయనుకునుకుంటే..ఇప్పుడు అనూహ్య దాడులతో ఉద్యోగులనే పరుగులు పెట్టిస్తున్నాయంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
రోబోట్లు ఉద్యోగాలు తీసుకోవడమే కాదు… ఉద్యోగులను పరుగులు పెట్టిస్తున్నాయి!😃
🔸 చైనాలోని ఓ ఆఫీసులో పనిచేస్తున్న హ్యూమనాయిడ్ రోబోట్ ఒక్కసారిగా మాల్‌ఫంక్షన్‌కు గురై చేతులు, కాళ్లు అదుపు లేకుండా ఊపుతూ ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేసింది.
🔸 రోబోట్ కదలికలు చూసి ఉద్యోగులు పరుగులు… pic.twitter.com/alC4rE30xd
— ముచ్చట్లు (@muchatlu_) July 5, 2026
