Sunita Williams | నిలిచిపోయిన సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర.. రాకెట్‌లో సాంకేతిక సమస్యే కారణం..?

Sunita Williams | భారత సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ మూడో అంతరిక్ష యాత్ర సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఎక్స్‌ (ట్విట్టర్‌) ద్వారా వెల్లడించింది. అయితే, మళ్లీ అంతరిక్ష యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంపై నాసా స్పష్టత ఇవ్వలేదు. అయితే, సునీతా విలియమ్స్‌ బోయింగ్‌ సంస్థకు చెందిన స్టార్‌లైనర్‌ స్పేస్‌సిప్‌లో నింగిలోకి ప్రయాణించాల్సి ఉంది.

Sunita Williams | నిలిచిపోయిన సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర.. రాకెట్‌లో సాంకేతిక సమస్యే కారణం..?

Sunita Williams | భారత సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ మూడో అంతరిక్ష యాత్ర సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఎక్స్‌ (ట్విట్టర్‌) ద్వారా వెల్లడించింది. అయితే, మళ్లీ అంతరిక్ష యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంపై నాసా స్పష్టత ఇవ్వలేదు.

సునీతా విలియమ్స్‌ బోయింగ్‌ సంస్థకు చెందిన స్టార్‌లైనర్‌ స్పేస్‌సిప్‌లో నింగిలోకి ప్రయాణించాల్సి ఉంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.04 గంటలకు ఫ్లోరిడాలోని కేప్‌ కెనావెరాల్‌ నుంచి అట్లాస్‌-V రాకెట్‌ ద్వారా స్టార్‌లైనర్‌ స్పేస్‌షిప్‌ నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో ప్రయోగానికి 90 నిమిషాల ముందు రాకెట్‌లో సమస్య కారణంగా ప్రయోగం నిలిచిపోయినట్లు సమాచారం.

ఈ మిషన్‌లో సునీతా విలియమ్స్‌ పైలట్‌గా వ్యవహరించబోతుండగా.. బుచ్‌ విల్‌మోర్‌ ఆమె వెంట ప్రయాణించాల్సి ఉంది. మిషన్‌లో భాగంగా ఇద్దరు కలిసి భూకక్ష్యలో తిరుగుతున్న ఇంటర్‌నేషనల్‌ స్పేస్‌సిప్‌లో వారం రోజుల పాటు బస చేయాల్సి ఉంది. బోయింగ్‌ సంస్థకు ఇప్పటి వరకు మానవరహిత ప్రయోగాలు నిర్వహించగా.. ఇదే తొలి మానవ సహితయాత్ర కావడం విశేషం.