Sunitha Williams | సురక్షితంగా భూమికి వస్తామనే నమ్మకం ఉన్నది : వ్యోమగామి సునీతా విలియమ్స్
Sunitha Williams | బోయింగ్‌కు చెందిన స్టార్ లైనర్ వ్యోమనౌక తమను సురక్షితంగా తిరిగి భూమి మీదికి చేర్చగలదనే నమ్మకం ఉందని భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆస్ట్రోనాట్ బుచ్ విల్మోర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Sunitha Williams | బోయింగ్‌కు చెందిన స్టార్ లైనర్ వ్యోమనౌక తమను సురక్షితంగా తిరిగి భూమి మీదికి చేర్చగలదనే నమ్మకం ఉందని భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆస్ట్రోనాట్ బుచ్ విల్మోర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇద్దరు ఆస్ట్రోనాట్స్ బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సుల్‌ని పరీక్షించేందుకు అందులో ఇద్దరు అంతరిక్షంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. నాసాకు చెందిన కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్‌లో భాగంగా ఇద్దరు స్టార్‌లైనర్‌లో ఇంటర్‌నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్లారు. అయితే, షెడ్యూల్ ప్రకారం.. ఇద్దరూ రెండువారాల కిందటే భూమిపైకి తిరిగి రావాల్సి ఉంది. పలు సాంకేతిక కారణాల కారణంగా వారి ప్రయాణం వాయిదాపడుతూ వస్తున్నది. కాగా, ఎప్పుడు తిరిగి రావాలన్న దానిపై ఎలాంటి తేదీని ఇంకా నిర్ణయించలేదని నాసా ఇటీవల ప్రకటించింది. అయితే, తొందరగా భూమిపైకి చేర్చాలన్న తొందరేమీ లేదని స్పష్టం చేసింది.
జూన్ 5న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతరిక్షను ప్రారంభించారు. ఐఎస్ఎస్ చేరుకునే క్రమంలో స్టార్‌లైనర్ వ్యోమనౌకలో హీలియం వాయువు లీకవడాన్ని గుర్తించారు. క్యాప్సుల్ దిశను మార్చే థ్రస్టర్లలో హీలియాన్ని వినియోగిస్తుటారు. అయితే, వ్యోమగాములు తిరిగొచ్చేందుకు ఈ సమస్య అడ్డంకి కాబోదని నాసా పేర్కొంది. అయితే, సమస్యపై మరింత సమాచారం సేకరించాకే వ్యోమగాములను తిరిగి భూమికి తీసుకురానున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఈ ఇద్దరు ఇంటర్‌నేషనల్ స్పేస్‌షిప్‌కు అనుసంధానమై ఉన్న క్యాప్సుల్‌లోని సర్వీస్ మాడ్యూల్‌లో ఉన్నారు. వాస్తవానికి సునీత, విల్మోర్ వారం పాటు ఐఎస్‌ఎస్‌లో ఉండి జూన్ 13న బయల్దేరి 14న భూమికి చేరుకోవాల్సి ఉన్నది. ఇక బోయింగ్ స్టార్‌లైనర్ గరిష్టంగా 45 రోజుల పాటు ఐఎస్‌ఎస్‌తో అనుసంధానమై ఉంటుంది. ఈ లెక్కన జూలై 22 వరకు సమయం ఉన్నది. అప్పటి వరకు సమస్య పరిష్కారం కాకపోతే ఇద్దరిని తిరిగి తీసుకువచ్చేందుకు స్పేస్ ఎక్స్‌కు చెందిన క్రూ డ్రాగన్.. లేకపోతే రష్యా సూయజ్ వ్యోమనౌకను పంపి తిరిగి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు సమాచారం.