TCSS | తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం

TCSS తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో ఏప్రిల్ 23న అక్కడి హెల్త్ అండ్ సైన్సు అథారిటీ (HSA) సమక్షంలో, 11 ఔట్ రమ్ రోడ్ లో ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరం విజయవంతం అయింది. వరుసగా గత పద్నాలుగు సంవత్సరాల నుంచి TCSS ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. సొసైటీ పిలుపు మేరకు ఎంతో మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా హెల్త్ […]

TCSS | తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం

TCSS

తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో ఏప్రిల్ 23న అక్కడి హెల్త్ అండ్ సైన్సు అథారిటీ (HSA) సమక్షంలో, 11 ఔట్ రమ్ రోడ్ లో ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరం విజయవంతం అయింది. వరుసగా గత పద్నాలుగు సంవత్సరాల నుంచి TCSS ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. సొసైటీ పిలుపు మేరకు ఎంతో మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా హెల్త్ అండ్ సైన్సు అథారిటీ ఆఫ్ సింగపూర్ అధికారులు మాట్లాడుతూ దశాబ్దానికి పైగా క్రమం తప్పకుండా ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఎల్లప్పుడూ ఇలాంటి లాభాపేక్ష లేని సామాజిక కార్యక్రమాలు చేస్తున్న తెలంగాణ కల్చరల్ సొసైటీని కొనియాడడంతో పాటు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలుగా రవి చైతన్య మైస, సంతోష్ వర్మ మాదారపు మరియు వెంకటరమణ వ్యవహరించారు. రక్త దానం చేసిన వారిలో సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ఉపాధ్యక్షులు గోనె నరేందర్ రెడ్డి, కమిటీ సభ్యులు శశిధర్ రెడ్డి, ప్రవీణ్ మామిడాల , సంతోష్ వర్మ మాదారపు మరియు ఇతర సభ్యులు ముక్కా కిషోర్, ముక్కా సతీష్, వినయ్ చంద్, నవీన్ కటకం, మల్లిక్ పల్లెపు, నవీన్ నోముల మరియు సాయి బాలె మొదలగు వారున్నారు.

ఈ రక్తదాన సేవ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన వారందరికి సొసైటీ (TCSS) తరపున సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు మరియు ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్ గుప్త, కమిటీ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల ధన్యవాదాలు తెలియ చేయడం జరిగింది. ఇలాంటి గొప్ప సేవా కార్యక్రమాలు ఎంతో సంతృప్తిని ఇస్తాయని తెలిపారు.