Terrorist : మ‌రో ఖ‌లిస్థానీ ఉగ్ర‌వాది మృతి.. కెన‌డాలో కాల్చిచంపిన గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు

Terrorist విధాత‌: కెన‌డా (Canada)లో ఉంటున్న ఖ‌లిస్థానీ ఉగ్ర‌వాది (Terrorist) హ‌ర్దీప్ సింగ్ నిజ్జ‌ర్‌ను గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కాల్చి చంపారు. సిక్కుల ప్రాబ‌ల్యం ఎక్కువ‌గా ఉన్న బ్రిటిష్ కొలంబియా ప్రావిన్సులోని స‌ర్రే న‌గ‌రంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. గురు నాన‌క్ సిఖ్ గురుద్వారాలో ఉండ‌గా హర్దీప్‌పై కాల్పులు జ‌రిగాయి. ఈ గురుద్వారాకు ప్రెసిడెంట్‌గా ఉన్న హ‌ర్దీప్‌.. ఖ‌లిస్థాన్ టైగ‌ర్ ఫోర్స్ (కేటీఎఫ్‌) అధినేత కూడాను. అంతే కాకుండా వేర్పాటు వాద సంస్థ సిఖ్స్ ఫ‌ర్ […]

Terrorist : మ‌రో ఖ‌లిస్థానీ ఉగ్ర‌వాది మృతి.. కెన‌డాలో కాల్చిచంపిన గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు

Terrorist

విధాత‌: కెన‌డా (Canada)లో ఉంటున్న ఖ‌లిస్థానీ ఉగ్ర‌వాది (Terrorist) హ‌ర్దీప్ సింగ్ నిజ్జ‌ర్‌ను గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కాల్చి చంపారు. సిక్కుల ప్రాబ‌ల్యం ఎక్కువ‌గా ఉన్న బ్రిటిష్ కొలంబియా ప్రావిన్సులోని స‌ర్రే న‌గ‌రంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. గురు నాన‌క్ సిఖ్ గురుద్వారాలో ఉండ‌గా హర్దీప్‌పై కాల్పులు జ‌రిగాయి. ఈ గురుద్వారాకు ప్రెసిడెంట్‌గా ఉన్న హ‌ర్దీప్‌.. ఖ‌లిస్థాన్ టైగ‌ర్ ఫోర్స్ (కేటీఎఫ్‌) అధినేత కూడాను.

అంతే కాకుండా వేర్పాటు వాద సంస్థ సిఖ్స్ ఫ‌ర్ జ‌స్ట‌స్ (ఎస్ ఎఫ్‌జె)లో కీలక స‌భ్యుడు. బ్రాంప్ట‌న్ న‌గ‌రంలో ఖ‌లిస్థాన్ రెఫ‌రెండం నిర్వ‌హ‌ణ‌లోనూ ఇత‌డు ప్ర‌ముఖ పాత్ర పోషించాడు. భార‌త్ మీద ఉగ్ర‌దాడి చేయ‌డానికి కుట్ర ప‌న్నుతున్నాడ‌ని తెలియ‌డంతో ఎన్ ఐ ఏ ఇత‌డిపై ఛార్జిషీటు సైతం న‌మోదు చేసింది. పంజాబ్‌లో ఒక హిందూ పూజారి హ‌త్య‌కు ప్ర‌ణాళిక రూపొందిస్తున్నాడ‌ని అందులో పేర్కొంది. అంతే కాకుండా హ‌ర్దీప్‌పై రూ.10 ల‌క్ష‌ల రివార్డు సైతం ప్ర‌క‌టించింది.

ప్లంబ‌ర్ ప‌ని చేసుకుంటూ…

కెన‌డాలో ప్లంబ‌ర్ ప‌ని చేసుకుంటూ క‌ష్ట‌ప‌డుతున్నాన‌ని అత‌డు చెప్పుకొన్నా.. ఖ‌లిస్థానీ ఉద్య‌మం పేరుతో నిధులు సేక‌రించి జ‌ల్సాలు చేసేవాడని తెలుస్తోంది. అంతేకాకుండా వేర్పాటు వాదానికి (Separatism) మ‌ద్ద‌తుగా నిలుస్తుంద‌ని పేరున్న స‌ర్రేలోని గురునాన‌క్ సిఖ్ గురుద్వారాలో బ‌ల‌వంతంగా పాగా వేసి ఏకంగా దానికి ప్రెసిడెంట్ అయిపోయాడు. ఎప్ప‌టిక‌ప్పుడు ద‌గ్గ‌ర్లోనే ఉన్న భార‌త హైక‌మిష‌న్ ద‌గ్గ‌ర భార‌త వ్య‌తిరేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డం ఇత‌డికి రివాజు.

పంజాబ్‌లో వేర్పాటువాదాన్ని పెంచ‌డానికి పని చేస్తున్న హ‌ర్దీప్‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని గ‌తంలో భార‌త్ ఆ దేశ ప్ర‌భుత్వానికి సూచించినా అటువైపు నుంచి స్పంద‌న క‌నిపించ‌లేదు. మ‌రో వైపు ఇదే వారంలో లండ‌న్‌లో ఉంటున్న మ‌రో ఖ‌లిస్థానీ నాయకుడు మృతి చెంద‌గా.. విష ప్ర‌యోగం వ‌ల్లే చనిపోయాడ‌ని అత‌డి అనుచ‌రులు ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.