Tesla Elon Musk | టెస్లా వినియోగదారులతో ఎలాన్ మస్క్ నేరుగా సంభాషణ

ఎలక్ట్రానిక్‌ వాహనాల మార్కెట్‌లో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న టెస్లా కంపెనీ సీఈవో నేరుగా కస్టమర్లతో సంభాషించి, కొనుగోళ్లలో వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Tesla Elon Musk | టెస్లా వినియోగదారులతో ఎలాన్ మస్క్ నేరుగా సంభాషణ

Tesla Elon Musk | ఇలాగైతే దుకాణం మూసేసుకోవాలని అనుకున్నారో ఏమోగానీ.. టెస్లా సీఈవో నేరుగా కస్టమర్లతో సంభాషణలకు దిగారు. సెప్టెంబర్ 4, 2025న ఎక్స్‌ వేదికగా వినియోగదారులను ఉద్దేశించి ఒక పోస్ట్‌ పెట్టారు. టెస్లా కార్ల కొనుగోళ్లు, వాటిని కస్టమర్లకు అందించే ప్రక్రియను వేగంగా, సులభంగా (fast and simple) చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కస్టమర్లు సంతృప్తి చెందటంతోపాటు.. వారి ఫ్రెండ్స్‌కు టెస్లా కార్ల కొనుగోళ్లకు సిఫారసు చేయగల స్థాయి విశ్వాసమే తమ కంపెనీ విజయంలో కీలక అంశమని తెలిపారు. టెస్లా వాహనాలు కొనుగోలు చేయాలనుకునేవారు మీరు ఎదుర్కొన్న ఇబ్బందులను ఈ పోస్టుకు నేరుగా రిప్లై రూపంలో తెలియజేయాలని మస్క్‌ కోరారు.

సమస్యల ఏకరువు

మస్క్‌ ఎక్స్‌ ఎకౌంట్‌కు కొందరు కస్టమర్లు వివిధ రకాల సమస్యలను ఏకరువు పెట్టారు. కొందరు ఆర్థిక ఇబ్బందులను ప్రస్తావించారు. అందులో ఒకరు.. సరదాగా నా దగ్గర తగినంత డబ్బు లేదు ‘I don’t have enough money’ అని కామెంటారు. ప్రధానంగా Cybertruck ధర 38 డాలర్ల నుంచి 98వేల డాలర్లకు పెరగడంపై తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమైంది.

టర్కీ దేశానికి చెందిన ఒక కస్టమర్‌ తాను జూలై 8వ తేదీ నుంచి టెస్లా కారు రిపేర్‌ కోసం ఎదురు చూస్తున్నానంటూ ఎలాన్‌ మస్క్‌కు ఫిర్యాదు చేశారు. ఒక స్పేర్‌పార్ట్‌ అందుబాటులో లేని కారణంగా నవంబర్‌ 23వ తేదీ వరకూ ఆలస్యమవుతుందని ఒక నివేదిక కూడా ఉండటం Tesla supply chain issuesను బయటపెట్టినట్టయింది.

మస్క్ వ్యక్తిగత వివాదాలు, విశ్లేషణ

ఎలాన్‌ మస్క్‌ రాజకీయ వైఖరి కూడా తీవ్ర చర్చనీయాంశం అయింది. ట్రంప్‌ ప్రభ్త్వంతో ఫైనాన్షియల్‌ పాలసీలపై జరిగిన వివాదం కస్టమర్ల నిర్ణయాలను తీవ్రంగా ప్రభావితం చేసిందని అభిప్రాయాలు ఉన్నాయి. సైబర్‌ట్రక్‌ రీసేల్‌ వ్యాల్యూ (Cybertruck resale value) 150,000 డాలర్ల నుంచి 84,000 డాలర్లకు దిగజారడం టెస్లా బ్రాండ్‌ ఇమేజ్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని కలిగించింది. ఇప్పుడు నేరుగా కస్టమర్లతో సంభాషించడం ద్వారా, ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవడం ద్వారా వినియోగదారుల నమ్మకాన్ని (customer trust) మళ్లీ పొందగలడా? అనేది వేచి చూడాలి.