US Army | అమెరికా రక్షణ శాఖ తమ సైన్యం నుంచి 90000 మందిని తప్పించే యోచన చేస్తున్నదని మిలటరీ డాట్‌కామ్ అమెరికా రక్షణ శాఖ అధికారులను ఉటంకిస్తూ పేర్కొంది. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా రక్షణ శాఖ ఈ ప్రతిపాదన చేస్తున్నట్టు ఆ అధికారులు వెల్లడించారు. సైనికుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 4,50,000 మంది నుంచి 3,60,000 మందికి తగ్గించే యోచన చేస్తున్నట్టు వారు తెలిపారు. వీరు రిజర్వు ఆర్మీలోని వారా లేక నేషనల్ గార్డ్సా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. మధ్య ఆసియా, ఆఫ్రికా దేశాల్లో తమ అవసరం తగ్గిపోవడం ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాతో ఉద్రిక్తలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్చలు మొదలయ్యాయి. ఎలాన్ మస్క్ నాయకత్వంలోని డీవోజీఈ ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించేందుకు అన్ని విభాగాల్లో ఉద్యోగాలకు కోత విధిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే రక్షణ మంత్రి పీట్ హెగ్ సేత్ ట్రిలియన్ డాలర్ రక్షణ బడ్జెట్‌లో ఎనిమిది శాతం తగ్గించే విషయమై చర్యలు తీసుకోవాలని తన విభాగం అధికారులను ఆదేశించారు.
US Army | 90వేల మంది సైనికులకు అమెరికా గుడ్‌బై?
US Army | అమెరికా రక్షణ శాఖ తమ సైన్యం నుంచి 90000 మందిని తప్పించే యోచన చేస్తున్నదని మిలటరీ డాట్‌కామ్ అమెరికా రక్షణ శాఖ అధికారులను ఉటంకిస్తూ పేర్కొంది. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా రక్షణ శాఖ ఈ ప్రతిపాదన చేస్తున్నట్టు ఆ అధికారులు వెల్లడించారు. సైనికుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 4,50,000 మంది నుంచి 3,60,000 మందికి తగ్గించే యోచన చేస్తున్నట్టు వారు తెలిపారు. వీరు రిజర్వు ఆర్మీలోని వారా లేక నేషనల్ […]

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు