Congo Boat Accident| రెండు పడవ ప్రమాదాలలో 193 మంది మృతి!
కాంగో దేశంలో జరిగిన రెండు వేేర్వేరు పడవ ప్రమాదాల్లో 193మంది జల సమాధి అయ్యారు. ఆయా పడవ ప్రమాదాల్లో మృతుల సంఖ్య మరింతగా పెరుగనుంది.
విధాత : జల రవాణ అధికంగా వినియోగించే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో(Congo Boat Accident)లో జరిగిన రెండు వేర్వేరు పడవ ప్రమాదాలు 193మంది ప్రాణాలు కోల్పోగా..మరికొందరు గల్లంతయ్యారు. ఆయా ప్రమాదాల్లో మృతుల సంఖ్య మరింత పెరుగనుంది. లుకోలెలా( Lukolela) వద్ద కాంగో నదిలో 500 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవలో మంటలు చెలరేగిన ప్రమాదంతో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 107మంది చనిపోయారు. స్థానిక మలాంగే గ్రామస్తుల పడవ సాయంతో మరో 209మందిని రక్షించారు. మరో 146మంది గల్లంతైనట్లుగా సమాచారం.
మరోవైపు ఈక్వెటార్ ప్రావిన్స్(Equateur province)లో జరిగిన మరో ప్రమాదంలో 86 మంది మృతి చెందారు. మృతుల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరికొందరు గల్లంతయ్యారు. పడవ సామర్ధ్యానికి మించి ఎక్కడంతోనే అది ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram