indonesia-philippines tragedies| ఆ దేశాల్లో విషాద ఘటనలు.. 35మంది మృతి
ఇండోనేషియా, దక్షిణ ఫిలిప్పీన్స్ లలో చోటుచేసుకున్న విషాద ఘటనలలో 35మందికిపైగా మృత్యువాత పడ్డారు.
విధాత : ఇండోనేషియా, దక్షిణ ఫిలిప్పీన్స్ లలో చోటుచేసుకున్న విషాద ఘటనలలో 35మందికిపైగా మృత్యువాత పడ్డారు. ఇండోనేషియాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 19 మంది మృతి చెందారు. మరో 73 మంది గల్లంతు అయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పశ్చిమ జావా ప్రావిన్స్‌లో భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రకృతి విపత్తులో కొండచరియాల ధాటికి 30కి పైగా ఇళ్లు నేలమట్టం అయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఫెర్రీ బోటుకు ప్రమాదం.. 16మంది మృతి
దక్షిణ ఫిలిప్పీన్స్‌లో ఫెర్రీ బోటు మునిగిన ఘటనలో 16 మంది మృతి చెందారు. మరో 28 మంది ఆచూకీ తెలియరాలేదని అధికారులు తెలిపారు. ప్రమాదం నుంచి 316 మందిని రక్షించారు. గల్లంతైన వారికోసం సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు ఫిలిప్పీన్స్ కోస్ట్ గార్డ్ పేర్కొంది. 332 మంది ప్రయాణికులు, 27 మంది సిబ్బందితో ప్రయాణిస్తున్న సమయంలో ఫెర్రీ బోట్ ప్రమాదానికి గురైనట్లుగా తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram