Bullet | క్యాన్స‌ర్‌ను నాలుగుసార్లు జ‌యించింది.. కానీ ఒక్క బుల్లెట్‌కు బ‌లైంది..

Bullet | క్యాన్స‌ర్( Cancer ) పేరు వింటేనే భ‌య‌మేస్తోంది. ఆ భ‌యంక‌ర‌మైన రోగం ఒక్క‌సారి మ‌న ద‌రి చేరితేనే వ‌ణికిపోతాం. ఆందోళ‌న‌కు గుర‌వుతాం.. కానీ ఆమె నాలుగు సార్లు క్యాన్స‌ర్‌ను జ‌యించింది. క్యాన్స‌ర్‌తో పోరాడిన‌ప్ప‌టికీ చివ‌ర‌కు ఒక్క బుల్లెట్( Bullet ) గాయంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.

కొల‌రాడో( Colarado )కు చెందిన జెన్నీఫ‌ర్ జేమ్స్‌( Jennifer James )(49)కు 29 ఏండ్ల వ‌య‌సున్న‌ప్పుడు బ్రెస్ట్ క్యాన్స‌ర్( Breast Cancer ) వ‌చ్చింది. రెండు ద‌శాబ్దాల‌పాటు బ్రెస్ట్ క్యాన్స‌ర్‌తో పోరాడి గెలిచింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ క్యాన్స‌ర్ బారిన ప‌డింది. అలా ఆమె చ‌నిపోయే నాటికి నాలుగుసార్లు క్యాన్స‌ర్‌ను జ‌యించింది. చివ‌ర‌కు బుల్లెట్ గాయానికి బ‌లైంది.

కాగా, ఏప్రిల్ 28న జెన్నిఫర్ జేమ్స్ ఇంట్లో ఉండగా కిటికీ నుంచి బుల్లెట్‌ చొచ్చుకొచ్చింది. ఆమె ఛాతిలోకి అది దూసుకెళ్లింది. బుల్లెట్‌ గాయంతో బాధపడుతూనే 911కి కాల్‌ చేసిన ఆమె ఇంట్లో కుప్పకూలి మరణించింది. పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. జెన్నిఫర్ జేమ్స్ ఇంటి బయట బుల్లెట్‌ పేల్చిన 20 ఏళ్ల ఎబెనెజర్ వర్క్‌ను అరెస్టు చేశారు. త‌న తుపాకీని శుభ్రం చేస్తుండ‌గా మిస్ ఫైర్ అయిన‌ట్లు వ‌ర్క్ తెలిపాడు.

మరోవైపు తాను అనుకోకుండా హ్యాండ్‌గన్‌ ఫైర్‌ చేసినట్లు పోలీసులకు నిందితుడు తెలిపాడు. కర్టెన్లు మూసి ఉన్న ఆ ఇంటి గోడలకు బుల్లెట్‌ తగిలి ఉంటుందని భావించినట్లు చెప్పాడు. అయితే పోలీసులు అతడిపై తీవ్రమైన నేరాపణలు మోపారు. కాగా, జెన్నిఫర్ జేమ్స్ కుమార్తె ఆష్లే, స్థానిక మీడియా ఎదుట తన బాధను వ్యక్తం చేసింది. ఇలా జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదని వాపోయింది.