అమెరికాలో కొనసాగుతున్న భారీ వరదలు

అమెరికాలో కొనసాగుతున్న భారీ వరదలు

విధాత : అమెరికాలో (America) భారీ వర్షాలు..వరదల బీభత్సం కొనసాగుతుంది. ఈశాన్య రాష్ట్రాలలో (Northeastern states) భారీ వరదలతో (Heavy floods)న్యూయార్క్ (NewYork), న్యూజెర్సీ (New Jersey), పెన్సిల్వేనియాలలో (Pennsylvania) పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మెక్సికోలోని వెరాక్రూజ్‌లోని లా మార్టినికాలో ఆకస్మిక వరదలు పోటెత్తాయి. లా మార్టినికాలో భారీ వరదలలో అనేక వాహనాలు కొట్టుకుపోయాయి. వరద నీటిలో కాగితపు పడవల్లా కొట్టుకపోతున్న వీడియోలు వైరల్ గా మారాయి. ఈ వరదల్లో కనీసం ఏడుగురు గాయపడ్డారు. సబ్‌వే లైన్లను కూడా మూసివేశారు.

భారీ వర్షాల కారణంగా న్యూజెర్సీ గవర్నర్‌ ఫిల్‌ మర్ఫీ (Phil Murphy) రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రజలు అవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించారు. న్యూయార్క్‌ నగరంలో పలు సబ్‌వే సేవలు రద్దుకాగా… రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మన్‌హట్టన్‌ సబ్‌వే స్టేషన్‌లోకి వరదనీరు ప్రవహిస్తున్న వీడియో సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొట్టింది.పెన్సిల్వేనియాలోని మౌంట్‌ జాయ్‌ ప్రాంతంలో కేవలం ఐదు గంటల్లోనే 17.8 సె.మీ వర్షం కురిసింది. దీంతో ఈ ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.