China Longest Airlines : ప్రపంచంలోనే పొడవైన ఎయిర్ రూట్ ప్రారంభం!
ప్రపంచంలోనే అతి పొడవైన షాంఘై-ఆక్లాండ్-బ్యూనస్ ఎయిర్స్ విమాన సర్వీస్ ప్రారంభం. 19,631కి.మీ దూరం… 25గంటల 30నిమిషాల ప్రయాణ సమయంతో చైనా రికార్డు!
విధాత : ప్రపంచంలోనే అతి పొడవైన విమాన మార్గం( World’s Longest Air Route)ను చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ సంస్థ ప్రారంభించింది. షాంఘై(చైనా) నుంచి అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ కు విమాన యాన సర్వీస్ ప్రారంభమైంది. ఈ విమాన మార్గం దూరం 19,631 కిలోమీటర్లు కావడం విశేషం. మొత్తం ప్రయాణ సమయం 25 గంటలు 30 నిమిషాలు. మధ్యలో న్యూజిలాండ్ లోని ఆక్లాండు వద్ద 2 గంటల స్టాప్ ఇంధనం నింపుకోవడానికి ఉంటుంది. ప్రయాణికులు విమానం మార్చాల్సిన అవసరం లేదు.
మూడు ఖండాల మధ్య కొనసాగే షాంఘై- ఆక్లాండ్- బ్యూనస్ ఎయిర్స్ విమాన ప్రయాణ మార్గం ఆసియా – దక్షిణ అమెరికా మధ్య మొదటిసారి నేరుగా విమాన యాన ప్రయాణంగా రికార్డు సాధించింది. పసిఫిక్ మహాసముద్రం మీదుగా షాంఘైని దక్షిణ అమెరికాతో కలుపుతో ఈ విమాన మార్గం సాగుతుతున్న ఈ మార్గంతో చైనా విమానయాన రంగం ముందడుగును చాటుతుంది. రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం తగ్గిపోతుంది. అంతర్జాతీయ ప్రయాణ సేవల్లో చైనా తదుపరి నెక్ట్స్ లెవల్ కు వెళ్లిందని నిపుణులు ప్రశంసిస్తున్నారు.
నిన్నటి వరకు న్యూయార్క్ జాన్ ఎఫ్ కెన్నెడీ విమానాశ్రయం – సింగపూర్ చాంగి విమాన మార్గం అత్యంత పొడవైనదిగా ఉంది. 15,332 కి.మీ.ల ఈ మార్గం 2021 నుండి అగ్రస్థానంలో ఉంది. ప్రయాణానికి సగటున 18 గంటల 40 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు షాంఘై- ఆక్లాండ్- బ్యూనస్ ఎయిర్స్ అగ్రస్థానంలో నిలిచింది.
ఆ తర్వాత రెండో స్థానంలో ఉన్న ఆసియా దేశాలకు, ఆస్ట్రేలియాకు నేరుగా ఉన్న సింగపూర్ చాంగి విమాన మార్గం మూడో స్థానంలోకి పడిపోయింది. దీని పొడువు 15,329 కి.మీగా ఉంది. ఆక్లాండ్-దోహా మధ్య ఉన్న 14,526 కి.మీ విమాన మార్గం మూడవ స్థానం నుంచి నాల్గవ స్థానంలోకి పడిపోయింది.
China’s Eastern Airlines launches world’s LONGEST direct flight
Nearly 20,000 KM across 3 continents to reach Buenos Aires
25-HOUR haul from Shanghai to Argentina pic.twitter.com/h9KWowlfm6
— RT (@RT_com) December 5, 2025
ఇవి కూడా చదవండి :
CPI Narayana : ఇండిగో సంక్షోభానికి కేంద్రమే కారణం: సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు..
Telangana Rising Global Summit 2047 : ఇంటర్నేషనల్ గ్లోబల్ సమ్మిట్ కు హైదరాబాద్ సన్నద్దం
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram