World’s longest train | ప్రపంచంలోనే పొడవైన రైలు ఇది..! 682 కోచ్‌లకు ఒకే ఒక్క లోకోపైలట్..!!
World’s longest train | ఈ రైలు ప్రపంచంలోనే అతి పొడవైనది( World’s longest train ). ఏకంగా 7 కిలోమీటర్ల పొడవున్న ఈ రైలు 682 కోచ్‌లను కలిగి ఉంది. అతి పెద్ద రైల్వే నెట్‌వర్క్( Railway Network ) కలిగిన మన ఇండియా( India )లో అనుకుంటే పొరపాటే.. మరి ఈ అతిపెద్ద రైలు ఎక్కడుందో తెలుసుకోవాలంటే ఆస్ట్రేలియా( Australia ) వెళ్లక తప్పదు.

World’s longest train | రైళ్లు కొన్ని వందల, వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంటాయి. రోజుకు కొన్ని లక్షల మందిని సురక్షితంగా వారి వారి గమ్యస్థానాలకు చేర్చుతుంటాయి రైళ్లు( Trains ). ప్రయాణికులను గ్యమస్థానాలకు చేర్చడమే కాదు.. బొగ్గు( Coal ), ఇనుము( Iron ) వంటి ముడి సరుకుతో పాటు అనేక రకాల మెటిరీయల్స్‌ను తరలిస్తుంటాయి గూడ్స్ రైళ్లు( Good Trains ). అయితే ప్యాసింజర్ రైళ్లు ఓ 30 వరకు, గూడ్స్ రైళ్లు ఓ 50 వరకు బోగీలను కలిగి ఉంటాయి. కానీ ఈ రైలు మాత్రం 682 బోగీలతో ప్రపంచంలోనే పొడవైన రైలుగా(World’s longest train ) రికార్డుల్లోకి ఎక్కింది. మరి ఈ రైలు గురించి తెలుసుకోవాలంటే ఆస్ట్రేలియా( Australia ) వెళ్లాల్సిందే.
భారతీయ రైల్వే( India Railways ) వ్యవస్థ మొత్తం 67,956 కిలోమీటర్ల నెట్‌వర్క్‌ను కలిగి ప్రపంచంలోనే నాలుగో స్థానంలో నిలిచినప్పటికీ.. అత్యంత పొడవైన రైలును మాత్రం కలిగి లేదు. 7 కిలోమీటర్ల మేర 682 కోచ్‌లను కలిగి ఉన్న ఆస్ట్రేలియన్ బీహెచ్‌పీ ఐరన్ ఓర్ రైలు( Australian BHP Iron Ore train ) ప్రపంచంలోనై పొడవైన రైలుగా రికార్డుల్లోకి ఎక్కింది. ఈ గూడ్స్ రైలు 8 ఇంజిన్లను కలిగి ఉంది. ఇంతటి భారీ రైలును ఒకే ఒక్క లోకోపైలట్( Loco Pilot ) సమర్థవంతంగా నిర్వహించగలిగాడు.
2001లో ఈ ఐరన్ ఓర్ రైలు చరిత్ర సృష్టించినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ రైలు పశ్చిమ ఆస్ట్రేలియాలోని
యండీ మైన్( Yandi mines ) నుంచి పోర్ట్ హెడ్‌ల్యాండ్( Port Hedland ) మధ్య ఇనుమును తరలించేది. ఏడు కిలోమీటర్ల పొడవున్న ఈ రైలు 10 గంటల్లో 275 కిలోమీటర్లు ప్రయాణించి ఇనుమును సరఫరా చేసేది. ఆస్ట్రేలియన్ బీహెచ్‌పీ ఐరన్ ఓర్ రైలు.. ఒకేసారి 82 వేల మెట్రిక్ టన్నుల(సుమారుగా 8.16 కోట్ల కేజీల) ఇనుమును తరలించేది. అయితే కాలక్రమేణా 682 బోగీలను 270కి కుదించారు. 8 ఇంజిన్ల నుంచి నాలుగు ఇంజిన్లకు తగ్గించారు.