Adah Sharma | నన్ను చాలా మంది చంపాలనుకున్నారు..నటి సంచలన వ్యాఖ్యలు

పూరీ దర్శకత్వంలో వచ్చిన ‘హార్ట్ ఎటాక్’ తో టాలీవుడ్ లోకి ఎంట్రి ఇచ్చిన ముద్దుగుమ్మ ఆదాశర్మ. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. 2008లో దర్శకుడు విక్రమ్ భట్ తెరకెక్కించిన హారర్ మూవీ ‘1920’ తో ఆదా సినిమాల్లోకి అడుగుపెట్టి.. మంచి గుర్తింపును సంపాదించుకుంది.

Adah Sharma | నన్ను చాలా మంది చంపాలనుకున్నారు..నటి సంచలన వ్యాఖ్యలు

విధాత, హైదరాబాద్ :

పూరీ దర్శకత్వంలో వచ్చిన ‘హార్ట్ ఎటాక్’ తో టాలీవుడ్ లోకి ఎంట్రి ఇచ్చిన ముద్దుగుమ్మ ఆదాశర్మ. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. 2008లో దర్శకుడు విక్రమ్ భట్ తెరకెక్కించిన హారర్ మూవీ ‘1920’ తో ఆదా సినిమాల్లోకి అడుగుపెట్టి.. మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన మూవీ‘ది కేరళ స్టోరీ’ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2023లో విడుదలైన ఈ చిత్రం వల్ల ఆదాకు బెదిరింపులు వచ్చినట్లు తెలిపింది. దీనిపై తాజాగా స్పందించిన ఆదా.. దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. దేశంలో సగం మంది తనను చంపాలనుకున్నారని చెప్పారు.

రిస్క్‌ ఉన్న పాత్రలు చేసినప్పుడే కెరీర్‌కు మరింత విలువ పెరుగుతుందన్నారు. తాను ‘1920’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినట్లు తెలిపారు. తొలి చిత్రమే పెద్ద సాహోసోపేతమని భావిస్తానన్నారు. ‘ది కేరళ స్టోరీ’ సినిమా విడుదలయ్యే వరకూ రిలీజ్ అయ్యే వరకూ తనకు మంచి స్క్రిప్ట్‌ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూచేదానిని అని చెప్పారు. ది కేరళ స్టోరీ తో తన జీవితం మారిపోయిందని తెలిపారు. దాని తర్వాత చేసిన ‘బస్తర్‌: ది నక్సల్‌ స్టోరీ’ విడుదలైన సమయంలో కూడా బెదిరింపులు ఎదుర్కొన్నట్లు ఆదా శర్మ వెల్లడించారు. దేశంలో సగం మంది తనను చంపాలని కోరకున్నారని తెలిపారు. మిగిలిన సగం మంది తనపై ప్రశంసలు కురిపించినట్లు చెప్పారు.

సవాలుతో కూడిన స్క్రిప్ట్ మాత్రమే ఎంచుకోవడానికే ఇష్టపడుతానని ఆదాశర్మ తెలిపారు. ‘పాత్రలో భావోద్వేగం లేకపోతే నాకు నచ్చదు. యాక్షన్ తో పాటు ఎమోషన్ టచ్ ఉండాలి. అది చూసి నా కుటుంబం ఆందోళన చెందాలి. అవన్నీ లేకపోతే ఇక ఆ పాత్ర చేయడం ఎందుకు అని నాకు అనిపిస్తుంది’ అని ఆదా శర్మ వెల్లడించారు. ప్రస్తుతం ఈ అందాల భామ, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నివసించిన ఫ్టాట్ లోనే ఉంటోంది. ‘బస్తర్ : ది నక్సల్స్’ సినిమాలో పవర్ ఫుల్ రోల్ లో కనిపించిన ఆదా శర్మ.. మరో యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అందాల భామ పోస్టులు, తన ఫిట్ నెస్ వీడియోలు పెడుతూ ట్రెండింగ్ లో నిలుస్తోంది.