Shamshabad Airport| సాంకేతిక లోపంతో మూడుసార్లు రన్ వే పైకి వెళ్లి తిరిగొచ్చిన విమానం!

Shamshabad Airport| సాంకేతిక లోపంతో మూడుసార్లు రన్ వే పైకి వెళ్లి తిరిగొచ్చిన విమానం!

విధాత, హైదరాబాద్ : ఇటీవల దేశీయంగా..అంతర్జాతీయంగా విమాన ప్రమాదాలు, విమానాల్లో సాంకేతిక లోపాల ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు(Shamshabad Airport)లో ఓ విమానంలో సాంకేతిక లో(Airplane Technical Glitch)తో రన్ వే (Runway Incident)పైకి మూడుసార్లు వెళ్లి తిరిగొచ్చిన ఘటన వైరల్ గా మారింది. శంషాబాద్-తిరుపతి అలియాన్స్ (Alliance Air) ఎయిర్ లైన్స్(Hyderabad Tirupati flight issue) విమానంలో సాంకేతిక లోపం చోటుచేసుకుంది. విమానం మూడు సార్లు రన్‌వే పైకి వెళ్లి తిరిగి వచ్చింది. విమానం టేకాఫ్ తర్వాత పైలెట్ సాంకేతిక లోపం గుర్తించారు. దీంతో వెంటనే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు. అలియాన్స్ విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నిలిచిపోయింది.

ఆ విమానంలో 37 మంది ప్రయాణికులు తిరుపతి వెళ్లాల్సి ఉంది. మూడు సార్లు రన్‌వే పైకి వచ్చి తిరిగి వెనక్కి వెళ్లిన విమానం తీరుతో విసుగెత్తిపోయిన ప్రయాణికులు అందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఐదు రోజుల క్రితం కూడా అలయన్స్ ఎయిర్ లైన్స్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. తిరుపతి వెళ్లాల్సిన 67 మంది ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పడిగాపులు కాశారు. ఆరోజు పైలెట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ వరుస ఘటనలు విమాన ప్రయాణికులను కలవరం పెడుతున్నాయి.