Site icon vidhaatha

Dhanush-Aishwarya|ధ‌నుష్‌కి విడాకులు ఇచ్చి ఆ వ్య‌క్తిని ర‌జ‌నీకాంత్ కూతురు పెళ్లి చేసుకోబోతుందా?

Dhanush-Aishwarya| నాగ చైత‌న్య‌,స‌మంత విడాకుల త‌ర్వాత హాట్ టాపిక్‌గా మారింది ధ‌నుష్‌-ఐశ్వర్య విడాకులు అనే చెప్పాలి.ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఎవ‌రు ఊహించని విధంగా విడాకులు తీసుకున్నారు. పెళ్లి తర్వాత 18 ఏళ్ల పాటు కలిసి ఉన్న వారు సడెన్‍గా వేరుపడడం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది.. విడిపోయిన రెండేళ్ల తర్వాత ధనుష్, ఐశ్వర్య విడాకులకు దరఖాస్తు చేశారు. చెన్నైలోని ఓ ఫ్యామిలీ కోర్టులో వారు విడాకుల కోసం పిటిషన్ వేసిన‌ట్టుగా తెలుస్తుంది. అయితే విడిపోయాక పిల్లల బాధ్యతను ఐశ్వర్య పంచుకునే అవకాశం ఉందని అంటున్నారు. పిల్లలను పోషించే బాధ్యత తనకు అప్పగించాలని ఇప్ప‌టికే ఐశ్వ‌ర్య కోరిందని స‌మాచారం. దానికి ధ‌నుష్ ఎలాంటి అభ్యంత‌రం కూడా చెప్ప‌లేదు.

ఇక ధ‌నుష్ నుండి విడిపోయాక ఐశ్వ‌ర్య రెండో పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు ఒక టాక్ న‌డుస్తుంది. విడిపోయిన త‌ర్వాత ధనుష్ కు ఇంకా తన భార్యపై ప్రేమ ఉంద‌ని తెలుస్తుంది. ధనుష్ ఆ రకంగా సిగ్నల్స్ ఇస్తున్నా.. ఐశ్వర్య మాత్రం రెండో పెళ్లి చేసుకునేందుకు డిసైడ్ అయింద‌ట‌. త్వ‌ర‌లోనే ర‌జ‌నీకాంత్ కూతురు రెండో పెళ్లి చేసుకుంటుంద‌ని ఓ టాక్ న‌డుస్తుంది. ఐశ్వర్య ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తో డేటింగ్ లో ఉంద‌ని, అత‌నిని పెళ్లి చేసుకోవాల‌ని భావిస్తుంద‌ని చెన్నై సర్కిల్ లో గట్టిగా ప్ర‌చారం న‌డుస్తుంది. ఈ ప్రచారానికి ఆధారాలు లేవు కాని..ఈ వార్త మాత్రం తెగ వైర‌ల్ కావ‌డంతో చాలా మంది చాలా రకాలుగా గుసగుసలాడుతున్నారు. మ‌రి దీనిపై ఐశ్వ‌ర్య ఏమైన స్పందిస్తుందా అనేది చూడాలి.

ఇక 2004లో తన తల్లిదండ్రుల అంగీకారంతో ధనుష్‌ని పెళ్లి చేసుకుంది ఐశ్వర్య రజినీకాంత్. ఈ దంపతులకు యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వివాహానంతరం భర్త ధనుష్ ఎదుగుదలకు ఎంత‌గానో స‌పోర్ట్ చేసిన ఐశ్వర్య.. ధనుష్ తో ‘3’ చిత్రానికి కూడా దర్శకత్వం వహించింది. 18 ఏళ్ల పాటు వీరి సంసారం స‌జావుగానే సాగింది. కాని ఉన్న‌ట్టుండి వారిద్ద‌రు ఎందుకు విడాకులు తీసుకున్నారు అనేది తెలియ‌రావ‌డం లేదు. ధనుష్ కొంతమంది హీరోయిన్స్ తో సన్నిహితంగా ఉంటున్నాడని.. అందుకే ఆమె అతని నుంచి విడాకులు కోరుతున్నట్టు అయితే ఓ టాక్ న‌డుస్తుంది.

Exit mobile version