Plane Fire During Takeoff| విమానంలో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
Plane Fire During Takeoff: ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా వరుస విమాన ప్రమాదాలు విమాన ప్రయాణికులకు కలవర పెడుతున్నాయి. తాజాగా అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం(Denver International Airport)లో ఓ విమానం టేకాఫ్ సమయంలో మంటలు(Plane fire during takeoff) చెలరేగడంతో ప్రయాణికులు ప్రాణాలు దక్కించుకునేందుకు విమానం అత్యవసరం ద్వారం నుంచి బయటకు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం ఏఏ3023(American Airlines flight) డెన్వర్‌లోని ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అవుతుండగా ల్యాండింగ్ గేర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది.
రన్ వేపై వెళ్తుండగా మంటలు..పొగలు చెలరేగాయి. ఇది గుర్తించిన పైలట్ వెంటనే రన్‌వేపై విమానం నిలిపివేశాడు. దీంతో 173 మంది ప్రయాణికులు, సిబ్బంది అత్యవసర ద్వారం నుంచి సురక్షితంగా దిగిపోయారు. ఒకరికి మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. ఈ విమానం డెన్వర్ నుంచి మియామీకి వెళ్లాల్సి ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
విమానంలో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఘటన
టేకాఫ్ సమయంలో అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం AA3023 ల్యాండింగ్ గేర్‌లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
ఇది గుర్తించిన వెంటనే రన్‌వేపై విమానం నిలిపివేత.. సురక్షితంగా దిగిపోయిన అందులోని… pic.twitter.com/rZAsowK6R0
— PulseNewsBreaking (@pulsenewsbreak) July 27, 2025
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram