Anant Ambani| భారీ ఖర్చుతో అనంత్ అంబాని, రాధిక పెళ్లి.. ఎప్పుడు, ఎక్కడ?
Anant Ambani| ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కొడుకు అనంత్ అంబాని అతి త్వరలో రాధిక మర్చంట్‌ని వివాహం చేసుకోనున్న విషయం తెలి

Anant Ambani| ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కొడుకు అనంత్ అంబాని అతి త్వరలో రాధిక మర్చంట్‌ని వివాహం చేసుకోనున్న విషయం తెలిసిందే. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ రాధిక మర్చంట్‌ల కోసం అంబానీ కుటుంబం మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ వేడుక నిర్వహించగా, ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ వ్యాపారవేత్తలు, ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరై సందడి చేశారు. భారీ ఖర్చుతో ఈ వేడుక నిర్వహించారు. ఇక పెళ్లికి టైం వచ్చింది. అనంత్ – రాధిక వివాహ వేడుకలని మొదలు పెట్టేశారు. మే 29న ఇటలీలో ప్రారంభమై జూన్ 1వరకు వేడుకలు జరుగుతాయని తెలుస్తుంది.మే 29న ఇటీలీలోని సిసిలీ నుండి క్రూయిజ్ ఎక్కి స్విట్జర్లాండ్‌లో దిగనున్నారు.
మూడు రోజలు పాటు భారీ షిప్‌లో ఈ పెళ్లి వేడుక జరగనుంది. ఈ లగ్జరీ షిప్ 4380 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని కూడా చెబుతున్నారు. అతిరథ మహారథులు ఈ పెళ్లిలో పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది. ముకేష్ అంబానీ, నీతా అంబాని, ఆకాశ్ అంబాని మినహ మిగతా అంబానీ కుటుంబ సభ్యులు అంతా కూడా క్రూయిజ్ పార్టీ ఫిట్టింగ్‌ల కోసం లండన్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. అతిథుల కోసం ఓడలో 600 మంది ఏర్పాటు చేశారని సమాచారం. అతిథులని అలరించడం కోసం ముకేష్ అంబాని భారీ ఏర్పాట్లే చేస్తున్నాడట. అనంత్, రాధిక మర్చంట్ ఎంగేజ్మెంట్ ఈవెంట్ కోసం మొత్తం రూ.1259 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడు పెళ్లి కోసం రూ.1200 కోట్లు ఖర్చు చేయబోతున్నట్టు తెలుస్తుంది. వేడుకకి 800 మంది అతిథులని ఆహ్వానించబోతున్నారట.
బాలీవుడ్ సెలెబ్రిటీలు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ కూడా పెళ్లి వేడుకలో పాల్గొననున్నారు. ఇంకా సన్నిహితులు, కుటుంబ సభ్యులు కూడా హాజరు కానున్నట్లు సమాచారం. స్వయంగా నీతా అంబానీ పెళ్లి ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు సమాచారం. బాలీవుడ్ నటీనటులకు వివాహ ఆహ్వానాలు కూడా అందుతున్నట్లు సమాచారం. దీని ప్రకారం నటీనటులు తమ షెడ్యూల్‌ను ప్లాన్ చేసుకొని పెళ్లి వేడుకలో సందడి చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.