AP | టెక్నాలజీతో సుపరిపాలన అందించాలి : ఏపీ సీఎం చంద్రబాబు
దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుని పౌరులకు సుపరిపాలన అందించాలి అనేది కూటమి ప్రభుత్వ లక్ష్యం అని దానికి అనుగుణంగానే విజన్, ప్రణాళికలను రూపొందించినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు
విధాత :
దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుని పౌరులకు సుపరిపాలన అందించాలి అనేది కూటమి ప్రభుత్వ లక్ష్యం అని దానికి అనుగుణంగానే విజన్, ప్రణాళికలను రూపొందించినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం సచివాలయంలో డాటా-డ్రివెన్ గవర్నెన్స్ – పాలనలో టెక్నాలజీ – ఆర్టీజీఎస్‌తో సమన్వయంపై మంత్రులు, హెచ్‌వోడీలు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖలవారీగా లక్ష్యాలు, సాధించిన అభివృద్ధిపై దృష్టి పెట్టాలని మంత్రులు, ఉన్నాధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. శాఖల వారీగా ఎవరు.. ఎన్ని దస్త్రాలు, ఎన్ని రోజుల్లో క్లియర్ చేస్తున్నారో చెప్పాలన్నారు.
సాంకేతికత ద్వారా ప్రజలకు సుపరిపాలన అందించాలని సూచించారు. గ్రామ సచివాలయాన్ని విజన్ యూనిట్ గా మార్చి సమర్ధవంతం వినియోంచుకోవాలన్నారు. ఇటీవల మొంథా తుఫాను సమయంలో ప్రాణ, ఆస్తి నష్టం తగ్గించడానికి ప్రధాన కారణంగా సాంకేతికతను వినియోగించడం వల్లే అని తెలిపారు. డాటా ఆధారిత పాలన ప్రస్తుతం అత్యంత కీలకమైన అంశంగా మారిందని సీఎం అన్నారు. పౌరులకు సంబంధించిన డాటా రియల్ టైమ్ గవర్నెన్స్ లో పొందుపరిచామని వివరించారు. 42 విభాగాల్లో డాటా మొత్తం అందుబాటులోకి తెచ్చామన్నారు.
విద్యార్థుల అన్ని ధృవపత్రాలు, ప్రజల హెల్త్ రికార్డులు డిజిలాకర్‌లో పొందుపర్చాలి అని సూచించారు. డాక్టర్ దగ్గరకు వెళితే డిజిలాకర్‌లో హెల్త్ రికార్డులు లభించాలని తెలిపారు. వీలైనంత త్వరగా దస్త్రాలు పూర్తి చేస్తే ప్రభావవంతంగా ఉంటుందని అధికారులకు సీఎం సూచించారు. డాటా లేక్ ద్వారా అన్ని విభాగాల్లో ఉన్న డాటా తెలుసుకోవచ్చని వెల్లడించారు. రోడ్డు యాక్సిడెంట్ జరగకుండా టెక్నాలజీని వినియోగించుకోవాలని సూచించారు. నిబంధనల ప్రకారం లేకపోవడం వల్ల 60-70 శాతం పనులు లిటిగేషన్లలో ఉంటున్నాయన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) వినియోగించి జీవోల ద్వారా లిటిగేషన్లు రాకుండా నివారించవచ్చన్నారు. దీర్ఘ, మధ్య, స్వల్పికాలిక లక్ష్యాల మేరకు ప్రణాళికలు రూపొందించాలని… దానికి అనుగుణంగానే విజన్ ప్రణాళికలు రూపొందించినట్లు తెల
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram