Varanasi Ganga Ghat | గంగా ఘాట్ లో పూజారి దుర్మార్గం..దేహశుద్ది

వారణాసి గంగా ఘాట్‌లో పూజారి మహిళలపై లైంగిక వేధింపులకు యత్నించగా బాధితులు ప్రతిఘటించి దేహశుద్ధి చేశారు. ఘటన వీడియో వైరల్ అయింది.

Reported by: Tejaswini Nanna | Latest News | Apr 01, 2026, 1:41 pm IST
Read Time: 3 mins
Varanasi Ganga Ghat | గంగా ఘాట్ లో పూజారి దుర్మార్గం..దేహశుద్ది

విధాత: దేవుడి ప్రతినిధిగా భావించే పూజారి రాక్షసుడిగా మారిపోయి మహిళలపై అఘాయిత్యానికి పాల్పడేందుకు యత్నించి దేహశుద్దికి గురైన ఘటన వారణాసి గంగా ఘాట్ లో చోటుచేసుకుంది. తమ సమస్యలు చెప్పుకుని దోష నివారణకు పూజలు చేయించుకునేందుకు వచ్చిన మహిళల పట్ల ఓ పూజారి కామాంధుడిగా మారి గంగా నది జలాల్లో పడవపైనే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

పూజారి వక్రబుద్దిని గ్రహించిన బాధిత మహిళలు ఇద్దరు పడవలోనే అతడిపై దాడికి దిగారు. నన్నే కొడతారా అంటూ మహిళలపై పూజారి ఎదురు దాడి చేసి..వాళ్ల బట్టలు చించి అవమానపరిచే ప్రయత్నం చేశాడు. ఇంతలో చుట్టుపక్కల బోట్ లలోని వారు అక్కడికి చేరుకోవడంతో పూజారి పడవ నుంచి గంగానదిలోకి దూకేసి పారిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఈ ఘటన డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న ఉత్తరప్రదేశ్ లోని ప్రసిద్ద వారణాసిలోని గంగా ఘాట్ లో జరుగడంతో ప్రతిపక్షాలు భారీ ఎత్తున ట్రోల్స్ చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి :

Muzaffarnagar Highway Accident : లక్కీ స్పాట్.. తప్పిన చావు !
Stampede At Sheetla Temple | ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది భక్తుల మృతి!