Jubileehills Bypoll | జూబ్లీహిల్స్ బైపోల్.. ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ముఖ్యమంత్రి, మంత్రులు ఎన్నికల నియామావళిని ఉల్లంఘిస్తున్నారని ఆ పార్టీ ఎంపీలు కేఆర్ సురేశ్ రెడ్డి, దామోదర రావు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Jubileehills Bypoll | జూబ్లీహిల్స్ బైపోల్.. ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు

విధాత : 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ముఖ్యమంత్రి, మంత్రులు ఎన్నికల నియామావళిని ఉల్లంఘిస్తున్నారని ఆ పార్టీ ఎంపీలు కేఆర్ సురేశ్ రెడ్డి, దామోదర రావు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. బై పోల్ ను కేంద్ర బలగాల పర్యవేక్షణలో నిర్వహించాలని ఈసిని ఎంపీలో కోరారు. అధికార కాంగ్రెస్ కు పోలీసులు అనుకూలంగా వ్యవరిస్తున్నందున తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీలు విజ్ఞప్తి చేశారు. జూబ్లీ హిల్స్ నియోజకవ్గంలో మహిళలు అధికంగా ఉన్నారని, ఈ నేపత్యంలో అక్కడ మహిళా అధికారులను నియమించాలని కోరారు. లేదంటే దొంగ ఓట్లకు అవకాశాం ఉంటుందని ఎంపీలు కేఆర్ సురేశ్ రెడ్డి, దామోదర రావు ఫిర్యాదులో పేర్కొన్నారు.