Viral News | పిల్లాడిగా మింగిన థర్మామీటర్.. 20 ఏళ్ల తర్వాత కడుపులో బయటపడింది.. చైనాలో వింత ఘటన!

Viral News | చైనాలో ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి చిన్నతనంలో మింగిన థర్మామీటర్.. దాదాపు 20 ఏళ్ల తర్వాత కడుపులో బయటపడింది.

Reported by: Chandram | Latest News | Apr 14, 2026, 8:29 pm IST
Read Time: 4 mins
Viral News | పిల్లాడిగా మింగిన థర్మామీటర్.. 20 ఏళ్ల తర్వాత కడుపులో బయటపడింది.. చైనాలో వింత ఘటన!

Viral News | చైనాలో ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి చిన్నతనంలో మింగిన థర్మామీటర్.. దాదాపు 20 ఏళ్ల తర్వాత కడుపులో బయటపడింది. పొట్టలో దాన్ని గుర్తించిన వైద్యులు ఆపరేషన్ చేసి దాన్ని తొలగించారు. దీనికి సంఘటన వైద్యరంగంలో చర్చనీయాంశంగా మారింది.

జెజియాంగ్ ప్రావిన్స్‌లోని వెన్‌జౌకు చెందిన 32 ఏళ్ల వాంగ్ అనే వ్యక్తి కొద్దిరోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఆస్పత్రికి వెళ్లగా వైద్యులు స్కానింగ్ చేశారు. అప్పుడు అతని డ్యూడినమ్ (పేగు భాగం)లో ఒక వస్తువు ఉన్నట్లుగా కనిపించింది. దీంతో దాన్ని తీక్షణంగా పరిశీలించగా అది మెర్క్యూరీ థర్మామీటర్ అని తెలిసింది. అయితే ఆ థర్మామీటర్ పేగు గోడను నొక్కుతూ ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. అది అలాగే ఉండటం వల్ల ఎప్పుడైనా చిల్లుపడి తీవ్ర రక్తస్రావం జరిగే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు.

ఆ థర్మామీటర్ గురించి వాంగ్‌ను అడగ్గా అతని చెప్పిన విషయాలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. ఎందుకంటే అది అప్పుడు మింగినది కాదు.. అతనికి 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అనుకోకుండా థర్మామీటర్ మింగానని బయటపెట్టాడు. అయితే ఆ వయసులో భయంతో తల్లిదండ్రులకు చెప్పకుండా ఉండిపోయానని తెలిపాడు. ఆ తర్వాత ఎలాంటి సమస్య రాలేదని.. దీంతో ఆ విషయాన్ని పూర్తిగా మరిచిపోయానని చెప్పాడు.

ఆ థర్మామీటర్ పొట్టలో ప్రమాదకరంగా మారే అవకాశం ఉండటంతో ఎండోస్కోపీ విధానంలో సర్జరీ చేశారు. కేవలం 20 నిమిషాల్లో ఆపరేషన్ చేసి థర్మామీటర్‌ను విజయవంతంగా బయటకు తీసేశారు. దాదాపు 20 సంవత్సరాలు థర్మామీటర్ కడుపులో ఉన్నప్పటికీ.. అది ఇంకా పనిచేస్తుందని వైద్యులు గుర్తించారు. కాకపోతే దానిపై ఉన్న కొలత గుర్తులే కాస్త మసకబారినట్లు తెలిపారు.

Read More:

Viral News | మేకప్ కిట్‌నే ఇవ్వలేని వాడివి.. జీవితాంతం ఎలా చూసుకుంటావ్.. పీటల మీద పెళ్లిని ఆపేసిన వధువు

Mangoes | మామిడి పండ్లు మిస్సవుతున్నా అని చెప్పిన ఉద్యోగిని.. లండన్ నుంచి సర్‌ప్రైజ్ ఇచ్చిన బాస్!