Viral News | మేకప్ కిట్‌నే ఇవ్వలేని వాడివి.. జీవితాంతం ఎలా చూసుకుంటావ్.. పీటల మీద పెళ్లిని ఆపేసిన వధువు
మేకప్ కిట్ ఇవ్వలేదని ఓ వధువు పీటల మీదనే పెళ్లి ఆపేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో సంచలనంగా మారింది. వరుడు 12 లక్షల కారు కొని తీసుకొచ్చినా.. వధువు మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీంతో రాత్‌తో ఘనంగా పెళ్లి వేదిక వద్దకు వచ్చిన వరుడు.. నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది.
Viral News | మేకప్ కిట్ ఇవ్వలేదని ఓ వధువు పీటల మీదనే పెళ్లి ఆపేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో సంచలనంగా మారింది. వరుడు 12 లక్షల కారు కొని తీసుకొచ్చినా.. వధువు మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీంతో రాత్‌తో ఘనంగా పెళ్లి వేదిక వద్దకు వచ్చిన వరుడు.. నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది.
ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలోని నహ్తౌర్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో పెళ్లి వేడుక అట్టహాసంగా జరుగుతుంది. నూర్‌పూర్ సమీపంలోని ఇస్లాంనగర్ నుంచి వరుడు శువైబ్ (బబ్బు) బారాత్‌తో డ్యాన్స్ చేసుకుంటూ ఘనంగా వచ్చాడు. పెళ్లి ఏర్పాట్లు అన్ని సవ్యంగా జరిగాయి. ఇక పెళ్లి ముహూర్తం దగ్గర పడేసరికి ఒక్కసారిగా వధువు షాకిచ్చింది. తనకు ఈ పెళ్లి అవసరం లేదని తెగేసి చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
పెళ్లికి నో చెప్పడంతో షాకైన అందరూ ఏమైందని వధువును ఆరా తీయగా అసలు విషయం తాపీగా చెప్పింది. పెళ్లి సమయంలో మేకప్ కిట్ తీసుకొచ్చి ఇస్తానని చెప్పారని.. కానీ తీసుకురాలేదని వరుడు, అతని కుటుంబంపై మండిపడింది. ఇంత చిన్న విషయానికే పెళ్లిని ఆపేస్తావా అని అందరూ నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా.. నా కనీస అవసరాలకే ప్రాధాన్యం ఇవ్వలేని వాడు.. జీవితాంతం ఎలా జాగ్రత్తగా చూసుకుంటాడని ప్రశ్నించడంతో అందరూ నోళ్లు మూసుకున్నారు.
ఈ పరిణామంతో షాక్‌కు గురైన వరుడు.. వధువుకు అనేక రకాలుగా నచ్చజెప్పేందుకు ప్రయత్నించాడు. పెళ్లి కోసం రూ.12 లక్షల విలువైన కొత్త కారు కొనుగోలు చేసి, పూలతో అలంకరించి తీసుకొచ్చానని.. పెళ్లికి ఒప్పుకో అని వేడుకున్నాడు. కానీ వరుడు బతిమిలాడినా.. పెద్దలు నచ్చజెప్పినా వధువు మాత్రం పెళ్లికి ససేమిరా అనేసింది.
అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత పెళ్లి రద్దవ్వడంతో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం నెలకొంది. కొద్దిసేపటికే అది కాస్త రాళ్లు, ఇటుకలు విసురుకునే స్థాయికి వెళ్లింది. వధువు తరఫు బంధువులు వరుడి కొత్త కారుపై రాళ్లు విసరడంతో అద్దాలు పగిలిపోయాయి.
ఈ గొడవ మరింత పెరగడంతో పోలీసులు రంగప్రవేశం చేసి.. ఇరువర్గాల వారిని శాంతింపజేశారు. ఆ తర్వాత కూడా వధువును ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ ఆమె ఒప్పుకోకపోవడంతో తన కుటుంబసభ్యులు, బంధువులతో వరుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని.. ఫిర్యాదు వస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Read More::
Mole | అమ్మాయిలకు అక్కడ పుట్టుమచ్చ ఉంటే.. పెళ్లి తర్వాత కోటీశ్వరులై పోతారట..!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram