Viral Wedding | పెళ్లి ఊరేగింపులో సెప్టిక్ ట్యాంక్ ట్రక్కులు.. చైనా యువకుడి నిర్ణయానికి నెటిజన్లు ఫిదా!

Viral Wedding | పెళ్లిలో ఊరేగింపు కోసం పెద్ద పెద్ద కార్లను వాడుతుంటారు. కానీ సెప్టిక్ ట్యాంక్ ట్రక్కులను వాడటం ఎప్పుడైనా చూశారా? చైనాకు చెందిన ఓ యువకుడు తన పెళ్లి ఊరేగింపులో సెప్టిక్ ట్యాంక్ ట్రక్కులను ఉపయోగించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

Viral Wedding | పెళ్లి ఊరేగింపులో సెప్టిక్ ట్యాంక్ ట్రక్కులు.. చైనా యువకుడి నిర్ణయానికి నెటిజన్లు ఫిదా!

Viral Wedding | పెళ్లంటే అంగరంగ వైభవంగా చేసుకోవాలని అనుకుంటారు. ఖరీదైన కార్లకు రకరకాల అలంకరణలు చేసి ఊరేగింపుల్లో పాల్గొంటారు. కానీ చైనాకు చెందిన యువకుడు మాత్రం సంప్రదాయాలకు భిన్నంగా సెప్టిక్ ట్యాంక్ ట్రక్కులనే పెళ్లి వాహనాలుగా ఉపయోగించుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ వినూత్న వివాహం ప్రస్తుతం ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌కు చెందిన పాన్ హోవోనాన్ అనే యువకుడి కుటుంబం గత రెండు దశాబ్దాలుగా మలినాల శుద్ధి వ్యాపారంలో ఉంది. డిగ్రీ పూర్తిచేసిన తర్వాత పాన్ తన తండ్రి చేసే వ్యాపారం కాకుండా ఒక స్టార్టప్ బిజినెస్‌ను ప్రారంభించాడు. కానీ అది విఫలం కావడంతో మళ్లీ కుటుంబ వ్యాపారమైన సివరేజ్ ట్రీట్‌మెంట్‌లోకి వచ్చేశాడు. 2023 నుంచి అదే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే లీ యాకింగ్‌తో పాన్ గత ఆగస్టులో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు.

ఎంగేజ్‌మెంట్ తర్వాత లీ యాకింగ్‌తో పాన్ మనసు విప్పి మాట్లాడాడు. తన ఫ్యామిలీ బిజినెస్ గురించి ఆమెకు వివరించిన పాన్.. అది తనకెంతో విలువైనదో చెప్పాడు. పెళ్లి వేడుకలో ఊరేగింపునకు లగ్జరీ కార్లకు బదులు తమ సెప్టిక్ ట్యాంక్ ట్రక్కులను వినియోగించుకోవాలని అనుకుంటున్నానని తన ఆలోచన పంచుకున్నాడు. పాన్ చెప్పిన మాటకు లీ యాకింగ్ కూడా అంగీకరించింది. తన భర్త చేసే పని కూడా ఇతర వృత్తుల మాదిరిగానే గౌరవప్రదమైనదే అని భావించింది.

ఇదే విషయాన్ని పాన్ తన తల్లిదండ్రులకు కూడా చెప్పాడు. ఆ మాట వినగానే వాళ్లు షాకయ్యారు. కొడుకు నిర్ణయాన్ని వెనగానే ముందుగా వెనుకంజ వేసినా.. తర్వాత కుమారుడి నిర్ణయాన్ని సమర్థించారు. తన వృత్తి ఎంత కష్టమైనదైనా, దానివల్ల వచ్చే ఆదాయం నిజాయితీగా కూడుకున్నదని పాన్ గర్వంగా తెలిపాడు. ఇతర ఉద్యోగాలతో పోలిస్తే ఈ రంగం స్థిరత్వం కలిగిందని కూడా పేర్కొన్నాడు.

ఇక మార్చి 28వ తేదీన వీరి పెళ్లి జరిగింది. ఈ వివాహ వేడుకలో తొమ్మిది సెప్టిక్ ట్యాంక్ ట్రక్కులను వినియోగించారు. ఆ ట్రక్కులను పూర్తిగా క్లీన్ చేసి, వాటిని పూలతో అలంకరించారు. వాటిలో రెండు ట్రక్కులు పాన్ కంపెనీకి చెందినవి కాగా.. మిగతావి అదే ఫీల్డ్‌లోకి చెందిన వారివి తీసుకున్నారు. పెళ్లిరోజున భారీ ఊరేగింపు చేశారు. ఈ క్రమంలో ఒక ట్రక్కుపై “హ్యాపీ మ్యారిడ్ లైఫ్” అనే ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి ఈ వినూత్న వివాహం ప్రస్తుతం నెటిజన్ల ప్రశంసలు అందుకుంటుంది. వృత్తి పట్ల గౌరవం ఎంత ముఖ్యమో చాటిచెబుతోందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Read More:

Viral Marriage | 68 కోట్ల కట్నం ఇచ్చి.. పాతికేళ్ల కుర్రాడిని పెళ్లి చేసుకున్న 55 ఏళ్ల మహిళా వ్యాపారవేత్త

Viral News | అమ్మో.. ఇంత శాడిస్టులా! పక్కింటోళ్లకు దెయ్యాల కథలు వినిపిస్తూ టార్చర్!