CM Revanth Reddy | ప్రజాప్రభుత్వంలో మైనారిటీలకు పెద్దపీట : సీఎం రేవంత్ రెడ్డి
స్వతంత్ర భారత దేశ తొలి విద్యా శాఖ మంత్రిగా పని చేసి.. దేశ విద్యా రంగానికి పునాదులు వేసిన ఘనత మౌలానా అబుల్ కలాం ఆజాద్ కే దక్కుతుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కొనియాడారు. దేశ తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి (జాతీయ విద్యా దినోత్సవం & మైనారిటీ సంక్షేమ దినోత్సవం ) సందర్భంగా విద్యారంగ ప్రగతికి ఆజాద్ చేసిన సేవలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు.
విధాత, హైదరాబాద్ :
స్వతంత్ర భారత దేశ తొలి విద్యా శాఖ మంత్రిగా పని చేసి.. దేశ విద్యా రంగానికి పునాదులు వేసిన ఘనత మౌలానా అబుల్ కలాం ఆజాద్ కే దక్కుతుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కొనియాడారు. దేశ తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి (జాతీయ విద్యా దినోత్సవం & మైనారిటీ సంక్షేమ దినోత్సవం ) సందర్భంగా విద్యారంగ ప్రగతికి ఆజాద్ చేసిన సేవలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చైర్మన్‌గా, వయోజన అక్షరాస్యత, సార్వత్రిక ప్రాథమిక విద్య, 14 సంవత్సరాల్లోపు బాలబాలికలందరికీ నిర్బంధ ఉచిత విద్య, వృత్తి శిక్షణ తో పాటు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఏర్పాటు వంటి విభిన్న విధానాలతో దేశంలో విద్యారంగ ఆభివృద్ధికి ఆజాద్ ఎంతగానో కృషి చేశారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.
ఆయన జయంతి రోజును (నవంబరు 11వ తేదీ) జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. మౌలానా ఆజాద్ స్పూర్తితో రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. అందులో భాగంగానే గ్రామీణ, నిరుపేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన ఉచిత విద్య అందించేందుకు ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఐటీఐలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా ( Advanced Technology Centers – ATCs) అప్ గ్రేడ్ చేశామని, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు ఉపాధ్యాయులు, లెకర్చర్ల నియామకంతో రాష్ట్రంలో విద్యాభివృద్ధికి పాటుపడుతున్నామని సీఎం తెలిపారు. జాతీయోద్యమంలో పాల్గొనడంతో పాటు అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షునిగా ఆజాద్ ఎనలేని సేవలు అందించారని సీఎం కొనియాడారు.
ఖిలాఫత్ ఉద్యమములో పాల్గొని బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడారని, జాతీయోద్యమములో హిందూ ముస్లిం ఐక్యతను కోరుకొని దేశ విభజనను వ్యతిరేకించారని సీఎం గుర్తు చేశారు. స్వాతంత్యం అనంతరం మైనారిటీలకు గొంతుకగా నిలిచారని, ఆజాద్ జయంతిని మైనార్టీ సంక్షేమ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. ప్రజా ప్రభుత్వంలో మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు తెలిపారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం నూతనంగా ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన’ ‘రేవంతన్నా కా సహారా’ కింద ఫకీర్, పథకాలు ప్రారంభించి రూ.30 కోట్ల నిధులు కేటాయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram