నాగిని ఇదే..స్నేక్ డ్యాన్స్ చూసేయండి !

నాగిని లా తలను పైకెత్తి నిటారుగా నిలబడి ‘డ్యాన్స్’ చేసిన పాము వీడియో వైరల్ అవుతోంది. ఇది విషరహిత ర్యాట్ స్నేక్ ప్రవర్తన అని నిపుణులు చెబుతున్నారు.

Snake Naagin Dance

విధాత : పాముల జాతులలో అనేక రకాలు ఉన్నప్పటికి కొన్ని తమ వింత జీవన శైలితో మిగతా వాటికి భిన్నంగా కనిపిస్తుంటాయి. తాజాగా ఓ పాము పురాణాల్లోని నాగిని మాదిరిగా తన తలను పైకెత్తి..శరీరాన్ని నిటారుగా నిలిపి మెలికలు తిప్పుతూ..కళ్లు విప్పార్చి చూస్తూ నిశిత పరిశీలన ద‌ృష్టితో కనిపిస్తూ అశ్చర్యపరుస్తుంది. పసుపు రంగుతో మెరిసిపోతుండే.. ఈ వింత పాము వైరల్ వీడియోను చూసిన నెటిజన్లు దీనిని డ్యాన్సింగ్ స్నేక్ గా పిలవచ్చంటున్నారు. వామ్మో ఈ పాము ఎన్ని వగలు, వయ్యరాలు పోతుందో అంటూ కామెంట్ చేస్తున్నారు.

భారతదేశమంతటా సాధారణంగా కనిపించే ఈ విషరహిత జాతి పాము(ర్యాట్ స్నేక్)లు తమ పరిసరాలను పరిశీలించడానికి లేదా రక్షణ కోసం తరచుగా నిటారుగా నిలబడతాయి. ఎదురయ్యే ప్రమాదాలను గమనించేందుకు తలపైకి ఎత్తి, శరీరాన్ని నిటారుగా నిలిపి నృత్యం తరహాలో కదలుతాయని సరీసృప నిపుణులు చెబుతున్నారు. కొన్నిసార్లు మగ పాములతో పోరాటంలో, లేదా సంభోగ సమయంలో కూడా ఇవి అలా నృత్య భంగిమలను అనుసరిస్తాయని చెబుతున్నారు.

 

ఇవి కూడా చదవండి :

అమరావతిపైజగన్ విద్వేషం..విధ్వంసాన్ని సాగనివ్వం: చంద్రబాబు
మూడు వేల కోట్లతో హైదరాబాద్‌లో మరో వెయ్యి కిలోమీటర్ల రహదారుల అప్‌గ్రేడ్‌

Latest News