Disha Patani| అండర్ వరల్డ్ క్రష్..దిశా పటానీ?
బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీకి ఆమె అందమే ఆమెకు ప్రమాదకరంగా మారినట్లుంది. అండర్ వరల్డ్ డాన్స్ దిశా పటానీతో డేటింగ్ ను ఆశిస్తున్నట్లుగా ఫిల్మ్ మీడియాలో రేగిన గాసిప్స్ కలవర పెడుతున్నాయి.

విధాత : బాలీవుడ్(Bollywood) బ్యూటీ దిశా పటానీకి(Disha Patani) అందం..గ్లామర్ తిరుగులేనిది. సోషల్ మీడియాలో, ఫ్యాషన్ షోలలో, సినీ ఈవెంట్లలో తరుచు తన క్లీవేజ్ షోలతో అభిమానులకు నిద్ర లేకుండా చేస్తుంటుంది. అయితే ఇప్పడు ఆమె అందమే ఆమెకు ప్రమాదకరంగా మారినట్లుంది. ఆమె అందానికి ఫిదా అయిపోయిన అండర్ వరల్డ్ డాన్స్(Underworld Threat) ఆమెతో డేటింగ్ ను ఆశిస్తున్నట్లుగా ఫిల్మ్ మీడియాలో రేగిన గాసిప్స్(Gossip)కలవర పెడుతున్నాయి. తమతో డేటింగ్ కు ఓకే అంటే మిలియన్ డాలర్లు ఇస్తామంటూ ఆఫర్లు చేసినట్లుగా కథనాలు వెలువడటం ఆమె క్రేజీని పెంచుతున్నప్పటికి..అదే స్థాయిలో ఆమె భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని బరేలోని దిశా పటానీ ఇంటిపై గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్, రోహిత్ గొదారా గ్యాంగ్ కాల్పులు జరుపడం సంచలనం రేపింది. కాల్పుల ఘటనతో ఆమె కుటుంబం, అభిమానులు దిశ పటానీ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆధ్యాత్మిక గురువులపై దిశా పటానీ సోదరి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాల్పులు జరిపినట్లుగా గోల్డీ బార్ గ్యాంగ్ ప్రకటించింది. ఈ ఘటన తర్వాతా అండర్ వరల్డ్ డాన్స్ చూపు దిశా పటానీపై అంటూ వార్తలు రావడం ఆమె అభిమానులను మరింత ఆందోళనలో పడేసింది.
లోఫర్’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది దిశా పటానీ. ఆ తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో పూర్తిగా బాలీవుడ్ సినిమాలతో బిజీ అయిపోయింది. హిందీలో రాధే, బాఘీ, యోధా వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. గతేడాది ‘కల్కి 2898 ఏడీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న దిశా ‘కంగువా’తో డిజాస్టర్ చవిచూసింది. తమిళంలో సంఘమిత్ర, హిందీలో మలంగ్ 2 సినిమాల్లో నటిస్తుంది.