Floating Stone In Ganges River| గంగా నదిలో తేలుతున్న రాయి..పూజలు

విధాత : రామాయణంలో శ్రీరాముడు లంకకు చేరేందుకు సముద్రంపై వానరసేన నిర్మించిన రామసేతు అందరికి తెలిసిందే. సముద్రంలో తెలియాడే ప్రత్యేక రాళ్లతో రామసేతును నిర్మించారని కథనం. అలాంటి ఓ భారీ రాయి గంగా నది ప్రవాహంలో తెలియాడుతుండగా స్థానికులు గమనించారు. ఈ ఘటన యూపీలోని ఘాజీపూర్ లో గంగానదిలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. గంగానది ప్రవాహంలో తెలియడుతున్న ఆ ప్రత్యేకమైన రాయికి తాళ్లు కట్టి ఒడ్డుకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. 3 క్వింటాళ్ల బరువు ఉన్నప్పటికి ఆ రాయి ఏ మాత్రం నీటిలో మునగడం లేదని…అచ్చం రామసేతు నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లకు మాదిరిగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ప్రకృతి స్వభావానికి భిన్నంగా నీటిలో మునగని రాయి విషయం తెలుసుకున్న భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో దానిని చూసేందుకు తరలివస్తున్నారు. ఇదంతా రామ మహిమ..హనుమన్ శక్తి అనుకుంటూ భక్తిప్రపత్తులతో జై శ్రీరామ్ నామ స్మరణలతో ఆ రాయికి పూజలు చేస్తున్నారు.
గతంలో రెండేళ్ల క్రితం బిహార్ పట్నాలోని రాజ్ ఘాట్ వద్ద గంగా నదిలో తెలియాడుతున్న ఓ రాయి లభించింది. దానిపై శ్రీరామ్ అని రాసి ఉండటం విశేషం. అప్పుడు ఆ రాయి చర్చనీయాంశంగా మారింది. ఆ రాయి రామ్ సేతు రాయి అని నమ్ముతూ ఇప్పటికి దానికి పూజలు చేస్తున్నారు. తాజాగా ఘజీపూర్ లో కూడా అలాంటి రాయి దొరకడంతో రామసేతు నిర్మాణానికి..ఈ రాళ్లకు సంబంధం ఉండవచ్చని భక్తులు నమ్ముతున్నారు.
గంగా నదిలో తేలుతున్న రాయి.
ఆ రాయికి తాడు కట్టి ఒడ్డుకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
రాయి 3 క్వింటాలు బరువు ఉన్న ఏ మాత్రం నీటిలో మునగడం లేదని… రామసేతు నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లకు దీనికి సంబంధం ఉందని అంటున్నారు.
ఈ ఘటన యూపీలోని ఘాజీపూర్‌లో జరిగింది. pic.twitter.com/te3zouhrzX
— greatandhra (@greatandhranews) July 19, 2025