Boy Steals Gold For Momos : బాలుడి నిర్వాకం.. మోమూస్ కోసం ఇంట్లోని బంగారాన్ని దొంగిలించి..
మోమోస్ పిచ్చి ముదిరి.. రూ. 80 లక్షల బంగారం ఫసక్! ఉత్తరప్రదేశ్‌లో ఏడో తరగతి బాలుడి నిర్వాకం. నగలు తెస్తేనే మోమోస్ ఇస్తానన్న వ్యాపారి.. చివరకు ఏం జరిగిందంటే?
మోమూస్ (momos) అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. వెజ్, నాన్‌వెజ్ ఫ్లేవర్స్‌లో దొరికే ఈ మోమూస్‌ను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. ఒకప్పుడు స్ట్రీట్ ఫుడ్ అంటే గోబీ, నూడిల్స్, చికెన్ పకోడా, పానీపూరీ వంటివే గుర్తొచ్చేవి. ఇప్పుడు వాటిలో మోమూస్ కూడా చేరిపోయాయి. చాలా మంది ఈవినింగ్ స్నాక్స్‌గా మోమూస్‌ను తినేందుకు ఇష్టపడుతున్నారు. అయితే, ఈ మోమూస్‌కు అడిక్ట్ అయిన ఓ బాలుడు ఏకంగా సొంత ఇంటికే కన్నం వేశాడు. లక్షలు విలువ చేసే నగలు దొంగిలించి (steals gold ornaments).. మోమూస్ అమ్ముకునే వ్యక్తికి ఇచ్చేశాడు. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. డియోరియా (Deoria) నగరానికి చెందిన ఏడో తరగతి విద్యార్థి మోమూస్‌కు అలవాటుపడ్డాడు. అయితే రోజు వాటిని కొనుక్కునేందుకు ఆ విద్యార్థి వద్ద డబ్బు ఉండేది కాదు. కానీ తినాలన్న కోరిక అతడు దొంగతనానికి పాల్పడేలా చేసింది. మోమూస్ కోసం సదరు విద్యార్థి ఇంట్లోని బంగారు ఆభరణాలను దొంగిలించేవాడు. వాటిని తీసుకెళ్లి మోమూస్ అమ్మే వ్యక్తికి ఇచ్చి తనకు కావల్సిన మోమూస్‌ను తీసుకునేవాడు. ఇలా ఇంట్లోని రూ.80 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు రోజుకొకటి దొంగిలించి మోమూస్ అమ్మే వ్యక్తి ఇచ్చేశాడు.
బాలుడి అత్త తన నగల కోసం బీరువా చూడగా.. అవి కనిపించలేదు. ఆభరణాలు మాయమైనట్లు గుర్తించింది. ఈ విషయంపై ఇంట్లో వాళ్లని ప్రశ్నించగా.. అసలు విషయం బయటపడింది. దీంతో బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కొడుకు బలహీనతను అడ్డుపెట్టుకొని మోమూస్ అమ్ముకునే వ్యక్తి నగలు కాజేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మోమూస్ అమ్ముకునే వ్యక్తిని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
ఇవి కూడా చదవండి :
Dalai Lama : 90 ఏళ్ల వయసులో రికార్డు.. దలైలామాకు గ్రామీ అవార్డు
Gold, Silver price fall today| భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు..మరింత తగ్గేనా?
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram