Uttarpradesh | గంటల వ్యవధిలోనే పెళ్లి, విడాకులు.. అసలేం జరిగిందంటే?

పెళ్లంటే ఎన్నో పనులు.. ఏర్పాట్లు ఉంటాయి. నెలల తరబడి పనులు చేసినా ఎక్కడిపనులు అక్కడే ఉంటాయి. అయినా, పెళ్లి సజావుగా జరిగితే అంతే చాలు అని నిర్వాహకులు.. వధువరుల కుటుంబ సభ్యులు కోరుకుంటారు. కానీ, పెళ్లి జరిగిన కొద్ది నిమిషాలకే పెళ్లి కూతురు విడాకులు కావాలంటే పరిస్థితి ఎంటో ఒక్కసారి ఆలోచించండి.

  • By: chinna |    trending |    Published on : Dec 02, 2025 7:11 PM IST
Uttarpradesh | గంటల వ్యవధిలోనే పెళ్లి, విడాకులు.. అసలేం జరిగిందంటే?

పెళ్లంటే ఎన్నో పనులు.. ఏర్పాట్లు ఉంటాయి. నెలల తరబడి పనులు చేసినా ఎక్కడిపనులు అక్కడే ఉంటాయి. అయినా, పెళ్లి సజావుగా జరిగితే అంతే చాలు అని నిర్వాహకులు.. వధువరుల కుటుంబ సభ్యులు కోరుకుంటారు. కానీ, పెళ్లి జరిగిన కొద్ది నిమిషాలకే పెళ్లి కూతురు విడాకులు కావాలంటే పరిస్థితి ఎంటో ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి పెళ్లే ఉత్తరప్రదేశ్ జరిగింది. దెదోరియాలోని భలువానీకి చెందిన విశాల్.. మధేశియా సలేమ్‌పూర్‌కు చెందిన పూజతో నవంబర్ 25న వివాహం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా వివాహ వేడుకలు ముగిశాయి.

అయితే, తరువాత అత్తింట్లోకి వెళ్లిన నూతన వధువు పూజ కేవలం 20 నిమిషాలకే బయటకు వచ్చి ‘ఇక్కడ నేను ఉండను, నా తల్లిదండ్రులను పిలవండి’ అని చెప్పింది. ఇది విన్న ఇరువురు కుటుంబ సభ్యులు, బంధువులు మొదట సరదాగా తీసుకున్నారు. ఆమె మాట మార్చకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. అసలు ఏమైందని అడగగా పూజ ఎలాంటి కారణం చెప్పకుండా ‘ఇక్కడ ఉండను’ అనే మాటనే రిపీట్ చేస్తూ వచ్చింది.

ఇరువైపుల కుటుంబాలు ఎన్నో రకాలుగా మాట్లాడి సమస్య ఏమిటో తెలుసుకునేందుకు ప్రయత్నించినా, ఆమె ఒక్క మాట కూడా చెప్పలేదు. తల్లిదండ్రులు కూడా వచ్చి మాట్లాడినా పరిస్థితి మారలేదు. దీంతో నవంబర్ 26న గ్రామ పెద్దలు పంచాయతీ ఏర్పాటు చేశారు. ఐదు గంటలపాటు జరిగిన చర్చల్లో కూడా పూజ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఎలాంటి మార్గం కనిపించకపోవడంతో పంచాయతీ అరుదైన నిర్ణయం తీసుకుంది. ఇరువురు కుటుంబాలు పరస్పర సమ్మతితో పెళ్లిని రద్దు చేసుకోవాలని సూచించింది. ఇద్దరికీ భవిష్యత్తులో మళ్లీ పెళ్లి చేసుకునే హక్కు ఉంటుందని రాతపూర్వక ఒప్పందం సిద్ధం చేశారు. వేడుకల సందర్భంగా ఇచ్చిన బహుమతులు, నగదు మార్పిడి మొత్తాన్ని తీసుకోవాలని నిర్ణయించారు.

అనంతరం.. సాయంత్రం 6 గంటలకే పూజ తిరిగి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయింది. కాగా, ‘పెళ్లికి ముందు ఆమె ఎలాంటి విషయాలు చెప్పలేద. సాధారణంగానే ఉంటూ పెళ్లికి సిద్ధంగా ఉంది’ అని వరుడు విశాల్ తెలిపాడు. అయితే, ఏవైనా సమస్యలు వస్తాయనే భావనతో విశాల్ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తమదైన శైలి లో స్పందించారు. కొందరు పూజ నిర్ణయాన్ని సమర్థించగా, మరికొందరు తీవ్రంగా వ్యతిరేకించారు.

Also Read –Govt Employees | ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ఎగ్జామ్..పాస్ కాకపోతే ఇంటికే
Revanth Reddy| సర్పంచులు మనోళ్లు ఉంటే.. మంచి పాలన అందుతుంది : సీఎం రేవంత్ రెడ్డి
PMO Building Sevatirth| పీఎంవో ఇక ‘సేవాతీర్థ్‌’..రాజ్ భవన్లు లోక్ భవన్లు