Krishna river floods । నాగార్జున సాగర్‌కు పోటెత్తిన వరద నీరు.. ప్రకాశం బరాజ్ వద్ద కృష్ణమ్మ ఉధృతరూపం
ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదులు పోటెత్తుతున్నాయి. ప్రత్యేకించి శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతున్నది. దీంతో అంతే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Krishna river floods । ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదులు పోటెత్తుతున్నాయి. ప్రత్యేకించి శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతున్నది. దీంతో అంతే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 884.10 అడుగుల వద్ద నీటి మట్టం ఉన్నది. నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలకు గాను ప్రస్తుతం 210.513 టీఎంసీలు ఉన్నాయి. పై నుంచి 489868 క్యూసెక్కుల వరద వస్తుండగా.. స్పిల్ వే, జల విద్యుత్తు ఉత్పత్తి, కాలువల ద్వారా 552864 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. దీనితో నాగార్జున సాగర్‌వైపు 540503 క్యూసెక్కుల వరద వస్తుండగా అంతే మొత్తాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఎగువన ఆలమట్టి ప్రాజెక్టుకు 70వేల క్యూసెక్కుల వరద వస్తుంటే.. 35వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. నారాయణపుర వద్ద ఇన్‌ఫ్లో 30వేల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 8272 క్యూసెక్కులు ఉన్నది. జూరాలకు 320000 క్యూసెక్కులు వస్తుండగా.. 321335 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్రకు 37160 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 15460 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదవుతున్నది.
నాగార్జున సాగర్‌కు దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టుకు 5,48,059 క్యూసెక్కులు వస్తుండగా.. 5,43,617 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. విజయవాడలోని ప్రకాశం బరాజ్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నది. ఇక్కడ 11,27,801 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. అంతే మొత్తాన్ని సముద్రంలోకి వదిలిపెడుతున్నారు. అటు గోదావరిపై ఉన్న చివరి బరాజ్ అయిన ధవళేశ్వరం వద్ద ఇన్‌ఫ్లో 5,10,322 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 5,11,943 క్యూసెక్కులు ఉన్నది.
గోదావరి నదికి కూడా భారీ స్థాయిలో వరద వస్తున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద 1,95,767 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 1,63,853 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదవుతున్నది. కడెం ప్రాజెక్టుకు 28,093 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 40,927 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉన్నది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 2,98,397 క్యూసెక్కులు వస్తుండగా.. 3,75,508 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. లక్ష్మీ బరాజ్ వద్ద 4,99,840 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంటే.. అంతే మొత్తాన్ని వదిలేస్తున్నారు. తుపాకుల గూడం సమ్మక్క బరాజ్‌కు 3,84,210 క్యూసెక్కుల వరద వస్తుండగా.. అంతే మొత్తాన్ని కిందికి పంపుతున్నారు. దమ్ముగూడెం సీతమ్మ సాగర్ వద్ద 3,33,527 ఇన్‌ఫ్లో ఉండగా.. అంతే మొత్తాన్ని విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద 3,08,636 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నది. ఇక్కడ నీటి మట్టం 40.90 అడుగులు దాటింది.