Harish Rao । రాష్ట్రవ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ విద్యాలయాల్లో పనిచేస్తున్న 6200 మంది పార్ట్‌టైం లెక్చరర్లు, టీచర్లను తొలగించడమేనా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు మీరిచ్చే కానుక? అని మాజీ మంత్రి హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. సోషల్ వెల్ఫేర్ విద్యాలయాల్లో పని చేస్తున్న 6200 మంది పార్ట్‌టైం టీచర్లు, లెక్చరర్లు, డీఈవోలు (DEOs) ను ఏకకాలంలో విధుల నుండి తొలగించడం దుర్మార్గమైన చర్యన్నారు. దీన్ని బీఆర్ఎస్ పక్షాన తీవ్రంగా ఖండించారు. మూడు నెలలుగా జీతాలు చెల్లించకుండా, జీతాలు ఇవ్వాలని అడిగినందుకు ఉద్యోగాల నుండి తొలగిస్తారా? అని ప్రశ్నించారు. ఇదేనా మీ ప్రజా పాలన? ఇదేనా మీరు చెప్పిన ఇందిరమ్మ రాజ్యం? అని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. విద్యా సంవత్సరం మధ్యలో టీచర్లను తొలగించి వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయుల బతుకులను ఆగం చేశారని ఆరోపించారు. మరోవైపు మీ నిర్లక్ష్య, అర్థం లేని నిర్ణయం వల్ల వేలాదిమంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. తొలగించిన పార్ట్‌టైం లెక్చరర్లు, టీచర్లు, డీఈవోలను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, మూడు నెలల పెండింగ్ జీతాలను తక్షణమే చెల్లించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
Harish Rao । ఉపాధ్యాయులకు మీరిచ్చే కానుక ఇదేనా? : సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్న
తొలగించిన పార్ట్‌టైం లెక్చరర్లు, టీచర్లు, డీఈవోలను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, మూడు నెలల పెండింగ్ జీతాలను తక్షణమే చెల్లించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.

Latest News
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం మృతి
ఈనెల 17 న హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి పర్యటన
విద్యా, పర్యాటక, వైద్య రంగాల్లో కలిసి పనిచేద్దాం.. ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-vకు సీఎం విజ్ఞప్తి
ఐవీ కొనేది రూ.11కు.. రోగులకు అమ్మేది మాత్రం రూ.325కు
నేటి నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
ఖైరతాబాద్ గణేశుడికి గవర్నర్ దంపతుల తొలి పూజలు
ప్రకృతిని కాపాడుదాం.. చవితి ప్రత్యేకత ను చాటుదాం : జర్నలిస్ట్ గిరి ప్రసాద్ సోముల
పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది
ఘనంగా ‘జై గౌరీపుత్ర గణేశా’ ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ*
పోతునూరు రైతుల “వరి” గోస