Gold Rates: కొండెక్కిన పసిడి.. ఇక కొనడం కష్టమే! 

బంగారం లకారానికి నాలుగంటే నాలుగే అడుగుల దూరంలో ఉంది. అది గట్టిగా పరుగులు పెడితే…ఒక్క రోజులో లక్ష రూపాయలను దాటేసేలా ఉంది. గోల్డ్‌ రేట్లు తగ్గొచ్చని చెప్పిన అంచనాలను తల్లకిందులు చేసి మరీ పైపైకి దూసుకెళ్లింది.

Gold Rates: కొండెక్కిన పసిడి.. ఇక కొనడం కష్టమే! 

Gold Rates: బంగారం లకారానికి నాలుగంటే నాలుగే అడుగుల దూరంలో ఉంది. అది గట్టిగా పరుగులు పెడితే…ఒక్క రోజులో లక్ష రూపాయలను దాటేసేలా ఉంది. గోల్డ్‌ రేట్లు తగ్గొచ్చని చెప్పిన అంచనాలను తల్లకిందులు చేసి మరీ పైపైకి దూసుకెళ్లింది. అంతర్జాతీయ మార్కెట్ లోహాల ధరలు పెరిగిన నేపథ్యంలో భారత్ మార్కెట్ లోనూ బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డును నమోదు చేశాయి. నిన్న ఒక్కరోజునే రూ.6,250పెరిగింది. నిన్న రూ. 96,450 ధరతో కొత్త రికార్డు నమోదు చేసిన బంగారం ధరలు ఈ రోజు కొంత దిగివచ్చాయి.  శనివారం హైదరాబాద్ మార్కెట్ లో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.250తగ్గి రూ.87,700వద్ధ నిలిచింది. 24క్యారెట్ల 10గ్రాముల ధర రూ.270తగ్గి రూ.95,670వద్ధ ఆగింది. బెంగుళూరు, చైన్నై, ముంబైలలో అవే ధరలు కొనసాగుతున్నాయి. న్యూఢిల్లీలో రూ.87,850, రూ.95,820గా ఉంది. దుబాయ్ లో 22క్యారెట్లకు రూ.84,530, 24క్యారెట్లకు 91,258గా ఉంది. అమెరికాలో రూ.84,226, రూ.89,813గా ఉంది.

వెండి ధరలు మరింత పైకి..!
పసిడితో పోటీ పడుతున్న వెండి ధరలు శనివారం మరో రూ.2000పెరిగి ఆల్ టైమ్ రికార్డు సాధించాయి. కిలో వెండి రూ.1,10,000కు చేరింది.

మరోవైపు బంగారం, వెండి ధరలను కట్టడి చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆసక్తి రేపుతున్నాయి. చాలా దేశాల సెంట్రల్ బ్యాంకులు ఓ ఐదారు వేల టన్నుల గోల్డ్‌ను ప్రపంచ మార్కెట్‌లో అమ్మకానికి పెడితే.. గోల్డ్‌ రేట్లు ఒక్కసారిగా ఢమాల్‌మనే పరిస్థితి కూడా రావొచ్చనేది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రారంభించిన అధిక సుంకాల సమరంఅన్ని దేశాలను అతలాకుతలం చేస్తున్న నేపధ్యంలో ద్రవ్యోల్బణం పెరిగి ప్రపంచ దేశాల్లో ధరలు ఒక్కసారిగా పెరిగిపోయే ప్రమాదం కూడా ఉందంటున్నారు. అయితే పరిస్థితులు ఎటు దారితీస్తాయో ఇప్పుడే చెప్పలేమంటున్నారు నిపుణులు.