Hyderabad | హైదరాబాద్‌లో ఉగ్ర కలకలం.. డాక్టరే ప్రధాన సూత్రదారి

వృత్తి మాత్రమే వైద్యం కానీ, చేసేవన్నీ ఉగ్రకుట్రలే. ప్రాణం పోయాల్సిన డాక్టర్ ఆయువు తీయడానికి ప్రాణాంతక విష రసాయనం తయారు చేశాడు.  హైదరబాద్ లోని ఓ ఇంటినే ప్రయోగశాలగా మార్చిన డాక్టర్ అహ్మద్‌ మొహియుద్దీన్ సయ్యద్.. సైనెడ్ కంటే ప్రమాదకర రైసిన్ అనే కెమికల్ ను తయారు చేయడం ఇప్పుడు హైదరాబాద్ లో కలకలం సృష్టిస్తోంది.

Hyderabad | హైదరాబాద్‌లో ఉగ్ర కలకలం.. డాక్టరే ప్రధాన సూత్రదారి

విధాత, హైదరాబాద్ :

వృత్తి మాత్రమే వైద్యం కానీ, చేసేవన్నీ ఉగ్రకుట్రలే. ప్రాణం పోయాల్సిన డాక్టర్ ఆయువు తీయడానికి ప్రాణాంతక విష రసాయనం తయారు చేశాడు.  హైదరబాద్ లోని ఓ ఇంటినే ప్రయోగశాలగా మార్చిన డాక్టర్ అహ్మద్‌ మొహియుద్దీన్ సయ్యద్.. సైనెడ్ కంటే ప్రమాదకర రైసిన్ అనే కెమికల్ ను తయారు చేయడం ఇప్పుడు హైదరాబాద్ లో కలకలం సృష్టిస్తోంది. సోమవారం హైదరాబాద్‌లో ముగ్గురు ఐసీస్ సానుభూతి పరులను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ (ఏటీఎస్) అరెస్ట్ చేసింది. వీరిలో ఉత్తరప్రదేశ్ కు చెందిన అజాద్ సులేమాన్ షేక్, మొహమ్మద్ సుహెల్ సలీం‌భాన్ లతో పాటు డాక్టర్ అహ్మద్ కూడా ఉన్నట్లు ఏటీఎస్ డీఐజీ సునీల్ జోషి తెలిపారు.

సలీంఖాన్, సులేమాన్ లు ఢిల్లీ, లఖ్‌నవూ, అహ్మదాబాద్ లాంటి సున్నిత ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారని డీఐజీ తెలిపారు. వీరిని పాకిస్థాన్ సరిహద్దు మీదుగా డ్రోన్ ల సాయంతో ఆయుధాలను సరఫరా చేస్తున్నారని.. రైసిన్ ను తయారు చేస్తున్నాడని డాక్టర్ మొహియుద్ధీన్ ను ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వీరంతా ముఠాగా ఏర్పడి దేశంలో రైసిన్ ద్వారా భారీ విధ్వంసం కుట్ర పన్నినట్లు ఏటీసీ డీఐజీ తెలిపారు. వీరిలో డాక్టర్ మొహియుద్దీన్ కీలకంగా వ్యవహరించినట్లు తెలిపారు. గుజరాత్ ఏటీఎస్.. వారిని అహ్మదాబాద్ సమీపంలో అదాలజ్ టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నించగా ఉగ్రకోణం వెలుగులోకి వచ్చింది. గుజరాత్ పోలీసులు శనివారం మొహియుద్దీన్ అరెస్ట్ విషయాన్ని తమకు అందించినట్లు అతని సోదరుడు ఫరూక్ ఆదివారం మీడియాకు వెల్లడించారు.