యాదగిరిగుట్ట.. కొమురవెల్లి భక్తులకు కేంద్రం గుడ్ న్యూస్

హైదరాబాద్‌ నుంచి యాదగిరి గుట్టకు వెళ్లే భక్తుల కోసం ఎంఎంటీఎస్(MMTS) రెండోదశ విస్తరణ పనులను త్వరలో ప్రారంభిస్తాం అని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. అలాగే ఇక్కడి నుంచి కొమురవెల్లి మల్లన్న దర్శనానికి వెళ్లే భక్తులకు మెరుగైన సౌకర్యం అందించేందుకు కొమురవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్‌ను కొత్తగా నిర్మించడం జరుగుతుందని తెలిపారు.

విధాత  : హైదరాబాద్‌ నుంచి యాదగిరి గుట్టకు వెళ్లే భక్తుల కోసం ఎంఎంటీఎస్(MMTS) రెండోదశ విస్తరణ పనులను రూ.500 కోట్లతో త్వరలో ప్రారంభిస్తాం అని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. అలాగే ఇక్కడి నుంచి కొమురవెల్లి మల్లన్న దర్శనానికి వెళ్లే భక్తులకు మెరుగైన సౌకర్యం అందించేందుకు కొమురవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్‌ను కొత్తగా నిర్మించడం జరుగుతుందని తెలిపారు.

ఈనెల చివరి వారంలో కానీ, వచ్చే నెల మొదటి వారంలో కానీ కొమురవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ను ప్రారంభించి భక్తులకు అంకితం చేస్తాం అని వెల్లడించారు.

తెలంగాణలో రూ.48 వేల కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైల్వేకు రూ.5,454 కోట్ల బడ్జెట్​తో 3 హైస్పీడ్ బుల్లెట్ ట్రెయిన్​లను కేటాయించిందన్నారు. 2014–15 ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌‌‌కు కేంద్రం రూ.1000 కోట్లు కేటాయించగా, 2026–-27 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రానికి రూ.5,454 కోట్ల బడ్జెట్ కేటాయించిందన్నారు. నూతన లైన్లు, డబ్లింగ్, ట్రిప్లింగ్, బైపాస్ లైన్ల నిర్మాణం, విద్యుదీకరణ, స్టేషన్ల పునరాభివృద్ధికి రూ.48 వేల కోట్లతో ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని వివరించారు. గత 12 ఏండ్లలో తెలంగాణలో 347 కిలో మీటర్ల మేర నూతన రైలు మార్గాలు, 556 కిలో మీటర్ల మేర డబ్లింగ్/ట్రిప్లింగ్ పనులను పూర్తి చేశామని వెల్లడించారు.

ఇటీవలి కేంద్ర బడ్జెట్‌‌‌‌లో 7 హై-స్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించారని, వీటిలో 3 తెలంగాణ రాష్ట్రానికే కేటాయించినట్టు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 5 వందే భారత్ రైళ్లు, 6 అమృత్ భారత్ ఎక్స్‌‌‌‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ లో పూర్తి స్థాయిలో రైల్వే కనెక్టివిటీ చేపడతామన్నారు. తెలంగాణలోనే 40 స్టేషన్లను రూ.2,000 కోట్లతో పునరాభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు.

Latest News