Kishan Reddy: మెట్రో ఫేజ్ 2తో కేంద్రంపై సీఎం దుష్ప్రచారం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2పై సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి మండిపడ్డారు. గత వారమే కేంద్రానికి మెట్రో ఫేజ్ 2కు సంబంధించిన డీపీఆర్ ఇచ్చారని, ఎల్ ఆండ్ టీతో ఎంవోయూ ఉందని..చాల విషయాలు ఇందులో చర్చించాల్సి ఉందని..అప్పుడే కేంద్రం అమోదించలేదంటూ సీఎం అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంపై విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు. కేంద్రం సీఎం రేవంత్ రెడ్డి కోసమో..కాంగ్రెస్ కోసమో పనిచేయదన్నారు.
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవంగా జరగాలని కోరుకుంటున్నానని..ఎన్నిక నిర్వహణకు నోటిఫికేషన్ విడుదలైందని..జాతీయ పార్టీ నాయకులు సునీల్ బన్సల్, శోభా కరంద్లాజే రేపు రాష్ట్రానికి వస్తున్నారని తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram