Kishan Reddy| డ్రగ్స్ రహిత దేశంగా భారత్ : కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్ వ‌ద్ద‌ ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి 'నమో యువ 3కే రన్‌' నిర్వహించారు. కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి 'నమో యువ 3కే రన్‌' ప్రారంభించి మాట్లాడారు. డ్రగ్స్ రహిత దేశంగా భారత్‌ను చేయాలన్న సంకల్పంతో 'నమో యువ 3కే రన్‌' చేపట్టడం జరిగిందన్నారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.

Kishan Reddy| డ్రగ్స్ రహిత దేశంగా భారత్ : కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి

విధాత, హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ 75జన్మదినోత్సవాల్లో(Modi Birthday ) భాగంగా డ్రగ్ ఫ్రీ భారత్ (Drug Free India) లక్ష్య సాధనకు రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్ వ‌ద్ద‌ ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి ‘నమో యువ 3కే రన్‌’ (Namo Yuva 3K Run) నిర్వహించారు. కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి(G Kishan Reddy)  ‘నమో యువ 3కే రన్‌’ ప్రారంభించి మాట్లాడారు. డ్రగ్స్ రహిత దేశంగా భారత్‌ను చేయాలన్న సంకల్పంతో ‘నమో యువ 3కే రన్‌’ చేపట్టడం జరిగిందన్నారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.

దేశంలో మోదీ పాలనలో దేశం వికసిత భారత్ దిశగా పురగమిస్తుందన్నారు. కుంభకోణాల మయమైన దేశాన్ని మోదీ ప్రభుత్వం 11ఏళ్లుగా అవినీతి రహిత పాలనతో అభివృద్ది వైపు ముందడుగు వేస్తుందన్నారు. అంతర్జాతీయంగా భారత్ ఆర్థికంగా ట్రిలియన్ డాలర్ల శక్తిగా రూపుదిద్దుకోబోతుందన్నారు. ఈ దిశగా భారత్ యువత కీలకమని..వారు డ్రగ్స్, మద్యం వంటి వాటికి దూరంగా ఉండటం ద్వారా దేశ పురోగామిలో భాగస్వామ్యం కావాలని కోరారు. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని..స్వదేశీ ఉత్పత్తులనే వినియోగిస్తామన్న ప్రతిజ్ఞ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.