Kishan Reddy : కేసీఆర్ కుటుంబమే సింగరేణి అక్రమాలకు ఆధ్యులు
సింగరేణి అక్రమాలకు కేసీఆర్ కుటుంబమే కారణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ కలిసి సంస్థ నిధులను దోపిడీ చేశాయని విమర్శించారు.
విధాత, హైదరాబాద్ : సింగరేణి సంస్థపై కేంద్ర ప్రభుత్వం అజమాయిషి ఎప్పుడు లేదని, సింగరేణి సంస్థలో అక్రమాలకు మాజీ సీఎం కేసీఆర్ కుటుంబమే ఆద్యులని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి సింగరేణి నైనీ బొగ్గు గనుల టెండర్ వివాదంపై స్పందించారు. సింగరేణిలో కేసీఆర్ కుటుంబం ఆర్థిక విధ్వంసం చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ అదే చేస్తుందన్నారు. తెలంగాణలోని ప్రభుత్వాల అక్రమాలపై దర్యాప్తు చేయకుండా గత బీఆర్ ఎస్ ప్రభుత్వమే సీబీఐని నిషేధిస్తూ జీవో జారీ చేసిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కూడా సింగరేణి సంస్థ నిధుల దోపిడీలో దొందు దొందే అన్నారు. రాష్ట్రం సీబీఐ విచారణ కోరితే కేంద్రం 12ఏళ్ల అక్రమాలపై విచారణ జరిపిస్తుందన్నారు.
రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి కీలక పాత్ర పోషించిందని, సింగరేణిలో ఖర్చు తగ్గించేందుకు గతంలోనే ఒక కమిటీ వేశాం. సింగరేణి డైరెక్టర్లకు ఆ కమిటీ రిపోర్ట్ ను వివరించామని తెలిపారు. నైనీ బ్లాక్ టెండర్ రద్దు పరిణామాలపై విచారణకు ద్విసభ్య కమిటీ వేశామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చేతగాకపోతే కేంద్రం టెండర్లు నిర్వహించేందుకు సిద్దం అని తెలిపారు. కేంద్రం చొరవ తీసుకుని ఒరిస్సా నుంచి నైనీ బొగ్గు బ్లాక్ ను కేటాయించేలా చూశామన్నారు.
సింగరేణి అక్రమాలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకులదే బాధ్యతం
బీఆర్ ఎస్ సింగరేణి సంస్థను నిర్వీర్యం చేస్తున్న సమయానికి ఇంకా నైని బ్లాక్ ఇష్యూ మొదలు కాలేదు అని, సింగరేణి బోర్డు ఇందులో నామామాత్రంగా ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండు కూడా సింగరేణిలో భారీ అక్రమాలకు పాల్పడి సంస్థ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయన్నారు. సంస్థ ఏ పార్టీ, ఏ కుటుంబాల ఆస్తి కాదని, కార్మికులది, ప్రజలది అని స్పష్టం చేశారు. సింగరేణి కార్మికుల బకాయిలు చెల్లించకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు వారిని ఇబ్బందులు పాలు చేశాయన్నారు. కేంద్ర ప్రభుత్వం వందల సంఖ్యలో బొగ్గు గనులు వేలం పాటలు నిర్వహిస్తుందని, ఎక్కడా కూడా అక్రమాలు జరుగలేదని, వన్ బిలియన్ టన్నుల రికార్డు ఉత్పత్తి జరిగిందన్నారు. కాని తెలంగాణలో మాత్రం గతంలో తాడిచర్ల, ఇప్పుడు నైనీ బ్లాక్ గనులు వేలంలో వివాదస్పదమయ్యాయని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.
నైని బ్లాక్ లో ఇప్పటివరకు 17 కంపెనీలు ఫీల్డ్ విజిట్ చేశాయని.. ఒక్క కంపెనీకి ఫీల్డ్ విజిట్ సర్టిఫికెట్ ఇవ్వలేదన్నారు. టెండర్ దాఖలకు ఈనెల 29 వరకు టైం ఉందన్నారు. మన్మోహన్ సింగ్ హయాంలో బొగ్గు కుంభకోణాలు జరిగాయని గుర్తు చేశారు. సింగరేణి సంస్థ కార్మికులకు, విద్యుత్తు సంస్థలకు 47వేల కోట్ల మేరకు ప్రభుత్వం బకాయిలు ఉన్నాయని, సంస్థ ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దారి మళ్ళి ఇస్తున్నాయని, దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసుతో రాజకీయ డ్రామా
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్, కాంగ్రెస్ లు రాజకీయ డ్రామా ఆడుతున్నాయని, రెండేళ్లుగా కేసు విచారణతో రాజకీయం చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వమే ఈ కేసులో జడ్జీల ఫోన్లను సైతం ట్యాప్ చేశారని అఫిడవిట్ వేశారని, ఇంకేందుకు చట్టపరంగా చర్యలు తీసుకోవడం లేదని కిషన్ రెడ్డి నిలదీశారు. మెట్రో రెండో దశపై కేంద్రం సూచనలు పాటిస్తే తప్పకుండా అందుకు ఆమోదం ఇస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి :
Tragedy Video | నొయిడాలో చనిపోయిన టెక్కీ యువరాజ్ మెహతా ఆఖరి క్షణాలు.. గుండెను పిండేసే వీడియో..
Gravity Lose Fact Check | ఆ రోజు గురుత్వాకర్షణ శక్తిని కోల్పోనున్న భూమి.. వాస్తవాలేంటి? నాసా ఏం చెబుతున్నది?
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram