Injection failure incident| ఇంజక్షన్ వికటించి 17మంది చిన్నారులకు అస్వస్థత
చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన వైరల్ ఫివర్ బాధిత చిన్నారులు ఇంజక్షన్ వికటించి మరింత అస్వస్థతకు గురైన ఘటన నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ లో చోటుచేసుకుంది.
విధాత : చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన వైరల్ ఫివర్ బాధిత చిన్నారులు ఇంజక్షన్ వికటించి (Injection failure incident)మరింత అస్వస్థతకు గురైన ఘటన నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ (Nagarjunasagar hospital)లో చోటుచేసుకుంది. వైరల్ ఫివర్ తో బాధపడుతున్న చిన్నారులు నాగార్జున సాగర్ ఆసుపత్రిలో వైద్య చికిత్స కోసం చేరారు. వైద్యలు రోజు మాదిరిగానే పిల్లలకు ఇంజక్షన్ ఇచ్చారు. అరగంట తర్వాత పిల్లలకు జ్వర తీవ్రత పెరగడం..వాంతులు, విరేచనాలకు గురవ్వడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
వెంటనే వైద్యులు బాధిత చిన్నారులకు ఐసీయూలో చికిత్స్ అందిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇక ఇంజక్షన్ కు బదులుగా మరొకటి ఇవ్వడంతోనే తమ పిల్లలు అనారోగ్యం పాలయ్యారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై వైద్యశాఖ అధికారులు విచారణ నిర్వహిస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram