Jabardasth: బుల్లితెర కామెడీ షో జబర్ధస్త్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ షో ద్వారా ఎంతో మంది మంచి పేరు ప్రఖ్యాతలు సాధించారు. అయితే కొందరు బయటకు వచ్చి ఈ షోపై చెత్త కామెంట్స్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా తన ట్యాలెంట్ తో బాగా పాపులర్
Jabardasth: బుల్లితెర కామెడీ షో జబర్ధస్త్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ షో ద్వారా ఎంతో మంది మంచి పేరు ప్రఖ్యాతలు సాధించారు. అయితే కొందరు బయటకు వచ్చి ఈ షోపై చెత్త కామెంట్స్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా తన ట్యాలెంట్ తో బాగా పాపులర్ అయిన కమెడియన్ నూకరాజు జబర్ధస్త్‌లో కుళ్లు రాజకీయాలు ఉన్నాయంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న నూకరాజు జబర్దస్త్ షో గురించి మాట్లాడుతూ.. టీమ్ లీడర్లుగా ఉన్న వాళ్ళు, సీనియర్స్ కొందరు కుళ్ళు రాజకీయాలు ప్రదర్శిస్తారని.. నేను ఎదిగే సమయంలో అవి భరించలేకపోయానంటూ కుండబద్దలు కొట్టి చెప్పాడు. జబర్ధస్త్ షోలో టాలెంట్ ఉన్న వారిని హైలైట్ చేయడం చాలా తక్కువ. వాళ్లకి నచ్చిన వారిని మాత్రమే హైలైట్ చేస్తుంటారని అన్నాడు.
డైలాగ్ చెప్పడం రాని వాళ్లని కూడా లేపడానికి ఎంతో ప్రయత్నిస్తుంటారు. టాలెంట్ ఉన్న వాళ్లని ఎంకరేజ్ చేసి తర్వాత వాళ్ల వాళ్లకి లిఫ్ట్ ఇవ్వడం ఓకే కాని ఇక్కడ అలా ఉండదు. ఈ రాజకీయాలు చూడలేక ఓ సారి ముఖం మీదే అడిగేసారు. అప్పుడు నన్ను కొన్ని ఎపిసోడ్స్ నుండి తప్పించారు కూడా. ప్రోమోలో కనపడకుండా చేసేవారు. అలాంటి సమయంలో నేను చాలా డిస్ట్రబ్ అయ్యాను. అయితే అంత రాజకీయం మధ్య నా రైటింగ్ నన్ను కాపాడి జనాలకి దగ్గర చేసిందని నూకరాజు అన్నాడు. ఇప్పుడు ఆయన టీం లీడర్‌గా ఉన్న విషయం తెలిసిందే. అయితే తన సమస్యలు ఇంకా పూర్తిగా తీరలేదని, ఒకటి పోయిందనుకుంటే మరొకటి వస్తుందని నూకరాజు చెప్పుకొచ్చాడు.
గత కొద్ది రోజులుగా ఏంజెల్ ఆసియాతో ప్రేమలో ఉన్న నూకరాజు పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఇప్పటికీ వారి పెళ్లికి పెద్దలు అంగీకారం చెప్పకపోవడంతో ఎలాగైన వారిని ఒప్పించి చేసుకోవాలని అనకుంటున్నాడు. అయితే మరీ అయితే లేట్ అయ్యే కొద్దీ ఇది ప్రేమ పోయి ఫ్రెండ్ షిప్ మాత్రమే అంటుందేమో అని మరో టెన్షన్ వస్తుంది అంటూ సరదాగా తన ప్రియురాలిని ఉద్దేశించి కామెంట్ చేశాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న ప్రియురాలు పిల్లోతో నూకరాజుని ప్రేమగా కొట్టింది. వారిని చూసి జంట బాగుందని ఆ దేవుడి ఆశీస్సులతో త్వరలోనే మీ పెళ్లి జరుగుతుందని, అన్ని కష్టాలు పోయి సుఖంగా ఉంటారని చెప్పుకొస్తున్నారు.