ప్రాణం తీసిన పరాచకం..అవమానం భరించలేక రిమాండ్ ఖైది ఆత్మహత్య

ప్రాణ స్నేహితుల మధ్య పరాచకమే ప్రాణం తీసింది. ఈ సంఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే

ప్రాణం తీసిన పరాచకం..అవమానం భరించలేక రిమాండ్ ఖైది ఆత్మహత్య

 జనగామ అక్టోబర్ 12 (విధాత):  ప్రాణ స్నేహితుల మధ్య పరాచకమే ప్రాణం తీసింది. ఈ సంఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజు పల్లి గ్రామానికి చెందిన పడకంటి బ్రహ్మ చారి, వారాల మల్లేశం ఇద్దరు స్నేహితులు. 15 రోజుల క్రితం సింగరాజు పల్లి గ్రామంలో వారాల మల్లేశం ఇంటి వద్ద పనిచేసుకుంటుండగా పడకండి బ్రహ్మచారి మల్లేశం వద్దకు వచ్చి బాగున్నావా అంటూ వీపుపై కోట్టాడు. దెబ్బ బలంగా తగలడంతో కోపానికి గురైన మల్లేశం తిరిగి తన ముందు ఉన్న కర్రను తీసుకొని చారిని కొట్టేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బ్రహ్మచారి చేయి విరిగింది. దీంతో బ్రహ్మ చారి భార్య స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. మల్లేశంపై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని రిమాండ్‌కు పంపారు. గత బుధవారం జైలుకు వెళ్లిన మల్లేశంకు కుటుంబ సభ్యులు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం జైల్లో ఉన్న మల్లేశం బ్లీచింగ్ పౌడర్ తాగాడు. ఇది గమనించిన జైలు సిబ్బంది అతన్ని జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మరణించాడు.

సమాచారం తెలుసుకున్న మల్లేశం కుటుంబ సభ్యులు జైలు అధికారుల నిర్లక్ష్యo వల్లే మల్లేశం ప్రాణం పోయిందని ఆదివారం జనగామ సబ్ జైల్ ముందు బైఠాయించారు. అతని మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, మల్లేశం కుంటుంబానికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మా డాడీని ఎలా జైలుకు పంపించామో అలాగే మాకు ఇవ్వాలని మల్లేశం కూతుర్లు, అతని భార్య విలపించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.