MLA Mynampally Rohit Rao: జర్నలిస్టుల కల సాకారమైంది: ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
మెదక్ ప్రెస్ క్లబ్ నూతన భవనాన్ని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ భవనాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. దీంతో జర్నలిస్టుల కల సాకారమైందనీ అన్నారు.

MLA Mynampally Rohit Rao: మెదక్ ప్రెస్ క్లబ్ నూతన భవనాన్ని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ భవనాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. దీంతో జర్నలిస్టుల కల సాకారమైందనీ అన్నారు. డబుల్ బెడ్ రూంకు సంబంధించి పట్టాలు రాని వారికి ఇప్పించాలని ప్రెస్ క్లబ్ అధ్యక్ష,కార్యదర్శులు నరేష్, ప్రసాద్ లు ఎమ్మెల్యేను కోరారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు నరేష్ గౌడ్, ప్రసాద్ లు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ యూనియన్ టీయుటీయు డబ్ల్యూ జే రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు, శంకర్ దయాళ్ చారి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు నాగరాజు, స్థానిక ప్రెస్ క్లబ్ నాయకులు కామాటి కిషన్, శ్రీదర్,శరత్, చారి, బీవికే రాజు, రియాజ్, సంగమేశ్వర్, వికాస్, నవీన్, శేఖర్, శివశంకర్ రావుతో పాటు ప్రెస్ క్లబ్ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రారంభానికి ముందు సర్వమత ప్రార్థనలు చేశారు.